వచ్చే ఏడాది తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.కాగా ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నికలు జరిగాయి.
ఈ ఉప ఎన్నికలలో గెలవడానికి ప్రధాన పార్టీలు రకరకాల ఫీట్లు చేశాయి.చివరాఖరికి అధికార పార్టీ టిఆర్ఎస్ గెలవడం జరిగింది.
ఇదంతా పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఓటర్ల సంఖ్య తగ్గిందట.ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన ఓటర్ల లిస్టుతో పోలిస్తే ప్రస్తుతం 5,99,900 మంది ఓటర్లు తగ్గిపోయారట.అయితే వీరిలో ఎక్కువమంది బోగస్ ఓటర్లే ఉన్నట్లు తేలింది.
ఇక మొత్తం ఓటర్లు 2,95,65,669 మంది ఉండగా వీరిలో పురుషులు 1,48,61,100, మహిళలు 1,47,02,914, ఇతరులు 1655 మంది ఉన్నారు.
ఇలా ఉంటే ఇప్పుడు మళ్లీ కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తుదారులు ఎక్కువ రావటంతో మళ్ళీ ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఏటా నిర్వహించిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియల భాగంగా ముసాయిదా జాబితాను ఎన్నికల సంఘం బుధవారం ఖరారు చేసి.
విడుదల చేయడం జరిగింది.ఈ క్రమంలో ఒకే ఫోటోతో ఉన్న వారిని గుర్తించి పెద్ద సంఖ్యలో బోగస్ ఓటర్లను తొలగించడం జరిగింది.








