టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ నిహారిక కొణిదెల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.నటిగా అంత సక్సెస్ కాలేకపోయినా కూడా వ్యక్తిగతంగా మాత్రం బాగా హాట్ టాపిక్ గా మారింది.
మెగా ఫ్యామిలీ నుండి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ మొదట్లో పలు సినిమాలలో నటించింది.కానీ అంతగా సక్సెస్ కాలేక పోయింది.
ఎంత ప్రయత్నించినా కూడా తనకు ఒక గుర్తింపు రాలేకపోయింది.దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.ఆ తర్వాత వెబ్ సిరీస్ లకు నిర్మాతగా బాధ్యతలు చేపట్టింది.ఇక చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకుంది.
పెళ్లి తర్వాత నిహారిక మొత్తం మారిపోయింది.తన వేషధారణతో మాత్రం అందరికీ షాక్ ఇచ్చేలా చేసింది.
గ్లామరస్ గా తయారవుతూ అందరి దృష్టిలో పడింది.
అంతేకాకుండా గతంలో ఒక పబ్ కేసులో కూడా ఇరికింది.
ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నిహారిక ఆ సమయంలో ఆ పబ్ కేస్ లో దొరికిపోవటంతో కొన్ని రోజుల వరకు సోషల్ మీడియా కు దూరం గా ఉంది.అయితే అంతకు ముందు మాత్రం సోషల్ మీడియాలో తన భర్త ఫోటోలను, వీడియో లను బాగా షేర్ చేసుకునేది.
ఇక ఆ కేసులో ఇరకటంతో సోషల్ మీడియాకు కొంత కాలం బ్రేక్ ఇచ్చింది.

మళ్లీ సోషల్ మీడియాలో అడుగుపెట్టి మరింత యాక్టివ్ గా మారింది.ఎప్పటిలాగే తన గ్లామరస్ ఫోటోలు పంచుకుంటూ ఉంది.అయితే గతంలో తన భర్తను దూరం పెట్టిందని కొన్ని వార్తలు వినిపించాయి.
కానీ అప్పుడే తన భర్తతో దిగిన ఫోటో పెట్టడంతో అదంతా పుకారని తెలిసింది.ఇక ఇప్పుడు.
గత కొన్ని రోజుల నుండి మళ్ళీ తన భర్తను దూరం పెట్టిందని తెలిసింది.
కనీసం ఫ్యామిలీ ఫంక్షన్లో కూడా తన భర్తతో ఉండట్లేదని.
అంతేకాకుండా ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారని.ముఖ్యంగా తమ పెద్దవాళ్లకు తెలియకుండా ఇద్దరు వేరే వేరే ఇళ్లల్లో ఉంటున్నారని తెలిసింది.
పైగా సోషల్ మీడియాలో కూడా తన భర్త ఫోటోలు పంచుకోకపోవడంతో అందరికీ అనుమానాలు వస్తున్నాయి.

అయితే తన ఫ్యామిలీకి కూడా ఈ విషయం తెలియడంతో.తన అన్నయ్య వరుణ్ తేజ్ తనకు గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది.ఈ విషయం గురించి మాట్లాడేందుకు నిహారికని ఇంటికి పిలిపించాడని.
ఇలాంటి పనులు చేసే ముందు పెద్దవారితో మాట్లాడాలి అంటూ.అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకోవద్దు అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడని తెలిసింది.
ఏదైనా విషయం ఉంటే పెద్దవారితో మాట్లాడి పరిష్కరించుకోవాలని.అంతేకానీ వేరుగా ఉండటం మంచిది కాదని అన్నాడట.దీంతో నిహారిక కానీ తప్పులు తెలుసుకొని తన భర్తకు దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తుందని తెలిసింది.అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం టాలీవుడ్ లో మాత్రం ఈ విషయం బాగా హాట్ టాపిక్ గా మారింది.







