మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.ఈ కేసులో నిందితుల దర్యాప్తు నేపథ్యంలో పోలీసుల విచారణపై ఉన్న స్టే ను తెలంగాణ హైకోర్టు ఎత్తివేసింది.
ఈ క్రమంలో పోలీసులు దర్యాప్తు చేయొచ్చని ధర్మాసనం పేర్కొంది.అదేవిధంగా ఈ వ్యవహారంపై బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ కు విచారణ అర్హత ఉందని న్యాయస్థానం తెలిపింది.
అయితే ఈ పిటిషన్ పై విచారణను పెండింగ్ లో పెట్టింది.