యుక్రెయిన్ కు భారీ ముప్పు పొంచి ఉందా? రష్యా అణుబాంబును ప్రయోగించనుందా? ఇప్పుడీ భయాలు పాశ్చాత్య దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.దీనికి కారణం రష్యా అధ్యక్షుడు పుతిన్ నోట అణుబాంబు మాట రావడమే.
ఇక, అసలు విషయానికొస్తే.ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తరచుగా అణుయుద్ధం గురించి మాట్లాడుతున్నారు.
తద్వారా ఆయన అగ్రరాజ్యం అమెరికా, పాశ్చాత్య దేశాలకు హెచ్చరికలు చేస్తున్నట్టే భావించాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.తాజాగా ఫ్రాన్స్ దేశాధినేత ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ తో మాట్లాడుతూ.
హిరోషిమా, నాగసాకి అణు విస్ఫోటనాల గురించి ప్రస్తావించారు పుతిన్.యుద్ధంలో గెలవాలంటే ఇలా ప్రధాన నగరాలపైనే దాడి చేయనక్కర్లేదు అంటూ ఎక్కడైనా అణుబాంబు వేయొచ్చన్న రీతిలో పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
ఉక్రెయిన్‌పై సైనిక చర్యను మరింత తీవ్రతరం చేసేందుకు యత్నిస్తోన్న రష్యా.అణ్వాయుధాలనూ ప్రయోగించే అవకాశం ఉందనే ఆందోళనలే వ్యక్తమవుతున్నాయి.ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై అణు బాంబుల దాడి ఘటనను తెరపైకి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది.ఉక్రెయిన్ పై సైనిక చర్యను మరింత తీవ్రతరం చేసేందుకు యత్నిస్తోన్న రష్యా.
అణ్వాయుధాలనూ ప్రయోగించే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై అణు బాంబుల దాడి ఘటనను తెరపైకి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్‌తో జరిపిన సంభాషణలో భాగంగా.యుద్ధంలో గెలిచేందుకు ప్రధాన నగరాలపైనే దాడి చేయాల్సిన అవసరం లేదంటూ జపాన్‌పై జరిగిన అణు దాడులను పుతిన్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
ఖేర్సన్‌లోని నైపర్ నది పశ్చిమ తీరం నుంచి రష్యా దళాలు వెనక్కి వెళ్తాయనే హామీ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.

‘జపాన్ లొంగిపోయేందుకు, రెండో ప్రపంచ యుద్ధం ముగింపునకు కారణమైన అణు దాడులు.యుద్ధంలో గెలవడానికి ప్రధాన నగరాలపైనే దాడి చేయాల్సిన అవసరం లేదనే విషయాన్ని చాటాయి’ అని పుతిన్.మెక్రాన్‌తో చెప్పినట్లు వెల్లడైంది.
ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించేందుకు అణ్వస్త్రాలను ప్రయోగించాలన్న పుతిన్ ఆలోచనలను ఈ వ్యాఖ్యలు బలోపేతం చేస్తున్నాయని పశ్చిమ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.ఉక్రెయిన్ సేనల ప్రతిదాడులతో యుద్ధక్షేత్రంలో కొంతకాలంగా మాస్కోకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
దీంతో.రష్యాను కాపాడుకునేందుకు అన్ని వనరులను వినియోగిస్తామంటూ పుతిన్ ఇటీవల హెచ్చరించారు.
ఆయన తాజా వ్యాఖ్యలనుబట్టి.రష్యా అణ్వాయుధాలు ప్రయోగించే అవకాశం లేకపోలేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా.రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా 1945 ఆగస్టులో అమెరికా.జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలపై రెండు అణు బాంబులను ప్రయోగించిన విషయం తెలిసిందే.ఈ దాడుల్లో లక్షలాది మంది మృతి చెందారు.దీంతో జపాన్ యుద్ధంలో లొంగిపోతున్నట్లు ప్రకటించింది.మానవ చరిత్రలో అణ్వాయుధ దాడులు జరిగింది ఈ రెండు ఘటనల్లో మాత్రమే.
అయితే పుతిన్ మరోసారి అణుయుద్ధం గురించి మాట్లాడడం పాశ్చాత్య దేశాల అధినేతలను కలవరానికి గురిచేస్తోంది.యుక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడానికి పుతిన్ వ్యూహాత్మక అణ్వాయుధాన్ని ఉపయోగించే అవకాశాలు ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, యూరప్ లో శీతాకాలం వస్తే మంచు పరిస్థితుల కారణంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరికొంతకాలం కొనసాగే అవకాశాలున్నాయి.వీలైనంత త్వరగా ఈ యుద్ధానికి ముగింపు పలకాలని పుతిన్ భావిస్తే అణ్వస్త్ర ప్రయోగానికి దిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కాగా.ఇప్పట్లో రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగిసిపోవడం లేదా ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనబడటం లేదు.ఒకవైపు రష్యా మిసైల్ దాడులతో యుక్రెయిన్‌పై విరుచుకుపడుతోంది.ఫిబ్రవరి 24న యుద్ధం మొదలైనప్పటి నుంచి దక్షిణ యుక్రెయిన్‌లోని ఖేర్సన్ బాంబు దాడులకు కేంద్రంగా మారింది.
అదీగాక ఈ యుద్ధంలో అత్యంత ఘోరంగా ఖేర్సన్ ప్రాంతం నాశనమైంది.రష్యా బలగాలు పట్టణాల్లోకి చొరబడి స్థానిక పౌరులను బలవంతంగా బయటకు పంపించేస్తున్నారు.







