తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మారుస్తూ టీఆర్ఎస్ నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ మేరకు ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లోగా ఎన్నికల సంఘానికి తెలపాలని టీఆర్ఎస్ ప్రకటించింది.
కాగా టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చేందుకు మరో నెల సమయం పట్టనుంది.దేశ అభ్యున్నతిని ఆకాంక్షిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ నూతన జాతీయ పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే.
తెలంగాణ రాష్ట్ర సమితి పేరునే భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ ఆయన గతంలోనే అధికారిక ప్రకటన చేశారు.







