అన్ని అవయవాలూ సరిగ్గా ఉండి కూడా అవకాశాలు లేవని మనలా ఆమె కూర్చొని ఏడవలేదు.ఒక్క కాలు పూర్తిగా లేదు ఆమెకి.
అయితేనేం, దానినే ఛాలెంజింగ్ గా తీసుకొని వున్నత శిఖరాలు అధిరోహించింది.వైకల్యం ఉన్నా అది జీవితానికి ఏమాత్రం అడ్డంకి కాదని నిరూపించింది.
పైగా వయస్సు పరంగా చూసినా ఆమెని అభినందించకుండా ఉండలేం.అవును, ఆ చిన్నారికి పూర్తిగా ఒక కాలు లేనే లేదు.
అయినా తాను నిరుత్సాహ పడకుండా సాధన చేస్తూ, పట్టువదలని విక్రమార్కుడిలాగా కష్టపడుతూ స్కేటింగ్ చేయడం నేర్చుకుంది.
బేసిగ్గా 2 కాళ్లూ సరిగా వున్నవాళ్లు కూడా స్కేటింగ్ చేయడానికి కాస్త భయపడతారు.
అలాంటిది ఆమె తనకు ఉన్న లోపాన్ని లోపం అని అనుకోకుండా స్కేటింగ్‌ను ఎంతో ఇష్టపడి నేర్చుకుంది.కట్ చేస్తే ఆ పట్టుదలే ఆమెని నేషనల్ ఛాంపియన్‌గా నిలబెట్టింది.
ప్రయత్నం చేయాలేగానీ అసాధ్యం కానిది ఏది లేదని నిరూపించింది.కేవలం ఒంటికాలితో స్కేటింగ్ చేసి అందర్నీ అవాక్కయేలా చేస్తోంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ చిన్నారి ప్రతిభ, సాహసం గురించి నెటిజన్లు చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు.

వివరాల్లోకి వెళితే, అర్జెంటీనాకు చెందిన మిలీ ట్రెజో అర్జెంటీనా అడాప్టవ్ స్కేటింగ్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని ఒంటికాలితో స్కేటింగ్ చేసి విశ్వ విజేతగా నిలిచింది.అలా ఆమె ఒక్క కాలుతోనే ఎంతో చాకచక్యంగా స్కేటింగ్ చేయడాన్ని చూసి అక్కడ జనం ఆశ్చర్యచకితులై తిలకించారు.తన శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం చూసి ప్రేక్షకులంతా చప్పట్లుతో ఆడిటోరియంని మోత మోగించారు.
తన ప్రదర్శన తర్వాత పరుగున వెళ్లి అక్కడే ఉన్న తన తల్లిని కౌగిలించుకోవడం ఇక్కడ వీడియోలో మనం చూడవచ్చును.మీరు కూడా ఈ వీడియోని చూసి ఫీలింగ్స్ చెప్పండి.







