కువైట్, వలసదారుల విషయంలో రోజు రోజుకి కటినంగా వ్యవహరిస్తోంది.గతంలో జరిగిన పరిణామాలతో పోల్చి చూస్తే ఇప్పటి కువైట్ వ్యవహరించే తీరు బిన్నంగా ఉంది.
కేవలం వలసదారులనే లక్ష్యంగా చేసుకొని కొత్త కొత్త రూల్స్ ను ప్రవేశ పెడుతోంది.సాధారణంగా వలసదారులు, వారి వారి వృత్తి నైపుణ్యాన్ని బట్టి, వారి విద్యార్హతను బట్టి కువైట్ లో ఉద్యోగం చేస్తున్నవారే.
అయితే ఇప్పుడు కువైట్ లో ఉద్యోగం సంపాదించటం మరింత కష్టతరం కాబోతోంది… అసలు విషయమేమిటంటే.
వృత్తి పరంగా కువైట్ రావలనుకునే వలసదారులకు కువైట్ ఇంకో కొత్త ట్విస్ట్ ఇచ్చింది.
వీరికి పరీక్షలు నిర్వహించబోతోంది.దీనికి సంబంధించి కువైట్, పబ్లిక్ అధారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ కసరత్తులు మొదలుపెట్టింది.
కువైట్ లో ఉండే వివిధ దేశాల రాయబార కార్యాలయాల భాగస్వామ్యంతో ఒక స్మార్ట్ మెకానిజంను అమలులోకి తీసుకురానుంది.దీనితో, ముందుగా ఆ దేశాలలో రావాలనుకునే వారికి పరీక్షలు నిర్వహించి అర్హతను బట్టి ఇక్కడికి రప్పించాలని తెలిపింది.
ఈ పరీక్షలు ధిరిటికల్ ,ప్రాక్టికల్ రెండు రకాలుగా జరుగుతాయి.ధీరిటికాల్ పరీక్ష సొంత దేశంలో జరిగితే, ప్రాక్టికల్ పరీక్ష కువైట్ లో జరగనుంది….
అయితే.

ఈ విధానంలో మొదటి 20 వృత్తుల వారికి దీనిని అమలు చేయనున్నారు.అంతేకాదు,కువైట్ సొసైటీ అఫ్ ఇంజినీరింగ్ ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి, అందులో 71 రకాల ప్రొఫిషన్ లోని వలస దారులకు ప్రత్యేకమైన టెస్ట్ ను నిర్వహిస్తారు.ఇప్పుడు జారీ చేయబోయే కొత్త పర్మిట్ లను లక్ష్యంగా పెట్టుకొని ఈ విధానాన్ని తీసుకువస్తోంది కువైట్.
ఇక పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ ఇన్ఫర్మేషన్ తెలియజేసిన గణాంకాల ప్రకారం, వివిధ విభాగాల్లో పని చేస్తున్న టెక్నికల్ స్టాఫ్ మొత్తం సంఖ్య, 21387 గా ఉంది.ఇకపై ఈ టెక్నికల్ ఉద్యోగాలకు ధీరిటికాల్,మరియు ప్రాక్టికల్ పరీక్ష రెండు పాస్ అవ్వాల్సి ఉంటుందట.