NTR Koratala Siva : NTR30' నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ఇక ఫ్యాన్స్ డౌట్స్ తీరినట్టే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ సినిమా కోసం రెడీ అవుతున్న విషయం తెలిసిందే.ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న యంగ్ టైగర్ ఈసారి కూడా అంతే స్థాయిలో పాన్ ఇండియా సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

 Finally Ntr30 Team Denies The Rumours And Gives The Update-TeluguStop.com

ఈ సినిమా తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.అయితే ఈ సినిమా ప్రకటించి నెలలు గడుస్తున్న ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు.

దీంతో ఫ్యాన్స్ సైతం ఈ ప్రాజెక్ట్ పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.అసలు ఈ ప్రాజెక్ట్ ఉందో లేదో తెలియక తికమక పడుతున్నారు.

అయితే తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు.ఈ సినిమా అసలు ఉందో లేదో అనే డౌట్ పడే వారికీ ఈ అప్డేట్ తో ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ ఉంది అని చెప్పకనే చెప్పారు.

డైరెక్టర్ కొరటాల, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ ఇంకా సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా పాల్గొంటున్న పిక్ ఒకటి నిర్మాణ సంస్థ షేర్ చేస్తూ ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ ఆందోళన చెందకుండా వారి అన్ని డౌట్స్ క్లియర్ అయ్యేలా చేసారు.దీంతో శరవేగంగా పనులన్నీ పూర్తి అవుతుండడంతో త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

ఇక ఇంకా ఈ సినిమాకు హీరోయిన్ ను ఫిక్స్ చేయలేదు.అలాగే ఇతర నటీనటుల గురించి కూడా తెలియాలంటే మరికొద్ది రోజుల పాటు వేచి ఉండాల్సిందే.ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.ఎన్టీఆర్ ఆర్ట్స్ ఇంకా యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మితం అవుతుంది.చూడాలి మరి ఈ నెలలో అయినా సెట్స్ మీదకు వెళుతుందో లేదో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube