సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.కేసీఆర్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
ఫామ్ హౌజ్ వ్యవహారం కేసులో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలను పవిత్రులను చెప్తున్నారని మండిపడ్డారు.వాళ్లు పవిత్రులు అవుతారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.2014 నుంచి 25 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకోలేదా అని ప్రశ్నించారు.రాజీనామాలు చేయించకుండా ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేయాలనేది కేసీఆర్ కుట్రని పేర్కొన్నారు.కేసీఆర్ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేదని విమర్శించారు.