బహ్మంగారి కాలజ్ఞానం గురించి అందరికీ తెలిసిందే.ఇప్పటి జనరేషన్ కి కాస్త అవగాహన తక్కువగానీ, మన తరం, మన నాన్నల తరానికి బాగా తెలుసు.
ముఖ్యంగా స్వర్గీయ నందమూరి తారకరామారావు నటించిన “శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర” అనే సినిమా ద్వారా చాలా విషయాలు వెలుగు చూశాయి.అందులో ప్రపంచ భవిష్యత్ ఏ విధంగా ఉంటుందో వివరించి ఉంటుంది.
కొంతమంది కుహనా మేధావులు ఆ విషయాలను కొట్టి పారేస్తున్నా, అటువంటి సంఘటనలు అయితే జరుగుతూ ఉండటం మనం గమనించవచ్చు.
తాజాగా బిహార్ గోపాల్గంజ్ జిల్లాలోని సింధ్వలియా ప్రాంతంలోని తెగ్రహి గ్రామంలో జరిగిన ఓ వింత ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురయ్యేలాగా చేస్తోంది.
అక్కడ ఓ వీధి కుక్కు 8 పిల్లలకు జన్మనిచ్చింది.అయితే ఇందులో వింత ఏమిటంటే ఆ పిల్లల్లో ఓ కుక్క పిల్ల చూడటానికి వింతగా ఉంది.అచ్చం మేక పోలికలు కలిగి ఉండి మేకపిల్లలాగే కనబడి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.దాన్ని మేక పిల్లగా భావించిన శంభు దాస్ అనే వ్యక్తి దాన్ని తన ఇంటికి తీసుకువెళ్లాడు.
ఆ తరువాత అది మేక కాదని తెలిసి బిత్తరబోయాడు.
ఇకపోతే, ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆ బుజ్జి కుక్కపిల్లను చూడటానికి తండోపతండాలుగా తరలివస్తున్నారు.సదరు మేక పిల్లని, కాదు కాదు కుక్కపిల్లను తీసుకెళ్లిన ఆ వ్యక్తి మొదట చుట్టు పక్కల అందర్నీ ఆ మేకపిల్ల తప్పిపోయింది… ఎవరిదని అడగగా, ఎవరూ సమాధానం చెప్పలేదట.ఈ క్రమంలో గమ్మత్తైన సంఘటన చోటు చేసుకుంది.
కొంత సమయానికి ఓ కుక్క వచ్చి.బుట్టలో దాచిన కుక్క పిల్లను నోటితో పట్టుకుని ఎత్తుకు పోయిందట.
అసలు విషయం తెలుసుకున్న స్థానికులు విస్తుపోయారట.