Tollywood Small Movies Release: ఒక్క పెద్ద స్టార్ సినిమా కన్నా పది చిన్న సినిమాలు మిన్నా !

ఒక్క స్టార్ సినిమా లేదు.అడ్వాస్ బుకింగ్ ల గోల లేదు.

 Tollywood Movies Releases This Week Urvashivo Rakshasivo Akasham Saradhi Jetti D-TeluguStop.com

పిచ్చెక్కిపోయే ఫ్యాన్స్ అరుపులు లేవు.కానీ పదుల సంఖ్యలో సినిమాలో ఈ వారాంతం అదృష్టం పరీక్షించుకున్నాయి.

అందులో ఎవరెవరు నటించారో కూడా మనకు తెలిసే అవకాశం లేదు.ఒకటి రెండు మినహా అన్ని పేరు కూడా తెలియని సినిమాలు.

ఇందులో అదృష్టం బాగుంది సినిమా కథలో దమ్ము ఉంటె కాస్త డబ్బు వచ్చి కొంత మందికి అవకాశం వస్తుంది.ఒక్క పెద్ద సినిమా రావడం కన్నా పది చిన్న సినిమాలు రావడం మిన్న అనే విధంగా తయారయ్యింది ప్రస్తుత సినిమా పరిష్టితి.

సినిమా థియేటర్ల ముందు ఎంతో హడావిడి కనిపిస్తుంది.

ఒక్క పెద్ద సినిమా వచ్చింది అంటే చిన్న సినిమాలకు థియాటర్లు దొరకవు.

గంపగుత్త లెక్కన అన్ని ఆ ఒక్క చిత్రం తో దండుకుంటారు.పైగా ప్రేక్షకుడికి జేబుకి పెద్ద సినిమా అయితే పెద్ద చిల్లు పడుతుంది.

కానీ ఇలా చిన్న సినిమాలు ఎక్కువ గా రిలీజ్ అవ్వడం వాళ్ళ ఎందరో వర్ధమాన నటీనటులకు అవకాశాలు దొరుకుతాయి.చాల డబ్బు మార్కెట్లో ప్రవహిస్తూ ఉంటుంది.

సినిమాలు షూటింగ్స్ చేసుకుంటూ ఎంతో మందిని బ్రతికిస్తాయి.అవి విజయం సాధిస్తాయా ఫాట్ అంటాయా అది వేరే విషయం.

ఒక్క స్టార్ హీరో సినిమా మార్కెట్ కి రాకపోతే చిన్న సినిమా ఊపిరి పీల్చుకుంటుంది.నిన్న మొన్నటి దాకా కరోనా భయం, ఆ తర్వాత ఓటిటి భయం.

Telugu Akasham, Allu Sirish, Jetti, Share Subscribe, Milli, Santosh Shoban, Sara

అంతటి తో వదల అడ్డగోలుగా టికెట్ రేట్లు , క్యాంటీన్ల లో భారీ మోసం, పార్కింగ్ లో కష్టాలు.ఆలా థియేటర్ కి వెళ్లి సినిమా చూసి వస్తే ఒక పెద్ద తీర్థ యాత్ర చేసినంత అలుపు సొలుపు.కానీ ఈ సారి పది కి పైగా చిన్న సినిమాలు అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి.అందులో కొన్ని పాన్ ఇండియా అంటూ మనపైన రుద్దుతున్న సినిమాలు.ఇక ఉర్వశివో రాక్షసీవో ఒకటి అల్లు అరవింద్ సినిమా కాబట్టి మంచి హైప్ వచ్చింది.పైగా బాలయ్య బాబు ఆడియో ఫంక్షన్ కి రావడం ఈ సినిమాకు ప్లస్ అయ్యింది.

ఇక ఆ తర్వాత లైక్, షేర్, సబ్స్క్రయిబ్ అంటూ సంతోష శోభన్ కూడా వచ్చేసాడు.ఇవి కాక ఆకాశం, సారధి, జెట్టి, ఇవి కాక జాన్వీ సినిమా మిలి ఇలా వగైరా వగైరా సినిమాలు సరే సరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube