Ram Charan Sukumar : చరణ్ నెక్స్ట్ సినిమా సెన్సేషనల్ కాంబోలో ఉండబోతుందా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నెక్స్ట్ RC16 సినిమా గురించి ఇప్పుడు అంతా క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నారు.ఇటీవలే రామ్ చరణ్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.

 Ram Charan Upcoming Movies, Rc15 , Ram Charan , Director Shankar, gowtam Tinnan-TeluguStop.com

ఈ సినిమాతో ఇతడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.దీంతో చరణ్ లైనప్ కూడా భారీ స్థాయిలోనే ఉంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా కంటే ముందు ప్రకటించిన లైనప్ లో మార్పులు ఉంటాయని ముందు నుండి వార్తలు వస్తున్నాయి.

పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకోవడంతో ఈయన లైనప్ కూడా అదే స్థాయిలో ఉండేలా చరణ్ ప్లాన్ చేసుకుంటున్నాడు.

ప్రెజెంట్ చరణ్ RC15 చేస్తున్నాడు.అగ్ర డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

దీని కంటే ముందే గత కొన్ని రోజుల క్రితమే చరణ్ జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో RC16 సినిమాను ప్రకటించాడు.

Telugu Shankar, Ram Charan, Ram Charan Tej, Rc, Sukumar-Movie

అయితే రెండు రోజుల క్రితం ఈ కాంబోలో చరణ్ RC16 రావడం లేదని పి ఆర్ టీమ్ నుండి అధికారిక ప్రకటన వచ్చింది.నెక్స్ట్ ఎవరితో చరణ్ సినిమా ఉంటుంది అనేది త్వరలోనే క్లారిటీ ఇస్తామని కన్ఫర్మ్ చేసారు.దీంతో అప్పటి నుండి చరణ్ నెక్స్ట్ చేయబోయే డైరెక్టర్ ఎవరో అని అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Telugu Shankar, Ram Charan, Ram Charan Tej, Rc, Sukumar-Movie

ఈ క్రమంలోనే చరణ్ 16వ సినిమాకు సెన్సేషనల్ కాంబో రిపీట్ కానుంది అన్నట్టుగా సినీ వర్గాల్లో ఒక టాక్ అయితే వస్తుంది.రామ్ చరణ్ కెరీర్ లో క్లాసిక్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ సుకుమార్.వీరి కాంబోలో రంగస్థలం సినిమా వచ్చి సెన్సేషనల్ హిట్ అయ్యింది.ఇక ఇప్పుడు కూడా సుకుమార్ దర్శకత్వంలోనే చరణ్ నెక్స్ట్ సినిమా భారీ లెవల్లో ప్లాన్ చేస్తున్నట్టు టాక్.

మరి ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో తెలియదు కానీ ఈ కాంబో మళ్ళీ ఉండబోతుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube