రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బుగ్గ రాజేశ్వర తండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.తండా సమీపంలోని అటవీ భూముల్లో ఉన్న చెట్లను స్థానిక గిరిజనులు నరికివేస్తున్నారు.
ఈ క్రమంలో అటవీ భూములు ఆక్రమించ వద్దంటూ ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు.ఫారెస్ట్ అధికారులకు, గిరిజనులకు మధ్య వాగ్వివాదం జరిగింది.
ఈ సందర్బంగా సమీప గిరిజన మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.దీంతో తండాలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.







