టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే.ఒక నటుడుగా ఎంత పేరు సంపాదించుకున్నాడో వ్యక్తిగతంగా కూడా అంతే మంచి పేరు సంపాదించుకున్నాడు.
ఈయనకు తెలుగు రాష్ట్రాలలో మంచి అభిమానం ఉంది.ఎన్నో సినిమాలలో నటించిన ఈయన స్టార్ హీరోగా ఎదిగాడు.
ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.యంగ్ హీరోలతో పోటీ గా వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటున్నాడు.
ఒక సినిమా షూటింగ్ బిజీలో ఉండగానే మరో సినిమాకు సైన్ చేస్తున్నాడు బాలయ్య.ఇటీవలే అఖండ సినిమాతో కెరీర్ పరంగా సెన్సేషనల్ హిట్ ను సొంతం చేసుకున్నాడు.
అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి భారీ వసూళ్లు సొంతం చేసుకుంది.
ఇక బాలయ్య వ్యాఖ్యాతగా కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాడు.
తెలుగు ఓటీటీ వేదికగా ఆహా లో ప్రసారమైన్న ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకే‘ అనే షో లో హోస్ట్ గా చేశాడు.మొదటి సీజన్ పూర్తిగా కాగా ప్రస్తుతం రెండవ సీజన్ ప్రారంభమైంది.
ఇక ఈ సీజన్ కూడా మరింత స్పైసీగా సాగుతుంది.రాజకీయ నాయకులను, స్టార్ నటులను తీసుకొచ్చి బాగా ఆసక్తి పెంచుతున్నాడు బాలయ్య.
ఇక అఖండ సినిమా తర్వాత మరో సినిమాలో బిజీ గా మారాడు.ఇక గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బాలయ్య.
ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రలలో కనిపించనున్నాడు.అంతేకాకుండా అనిల్ రావిపూడి దర్శకత్వం లో కూడా మరో సినిమాకు సైన్ చేశాడు.
వెంకీ అట్లూరితో పాటు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ తో పాటు దిల్ రాజు బ్యానర్ లో కూడా వరుస సినిమాలకు సైన్ చేశాడని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలలో కూడా అవకాశాలు అందుకున్నాడు.ప్రస్తుతం రియాలిటీ షో తో పాటు షూటింగ్లో బిజీగా ఉన్నాడు.ఇక ఇదంతా పక్కన పెడితే ఇటీవలే ఓ సిని ఈవెంట్లో పాల్గొన్నాడు బాలయ్య.
అందులో తనను మరో హీరో అల్లు శిరీష్ ఒక ప్రశ్న వేశాడు.అల్లు శిరీష్ ఊర్వశివో.
రాక్షసివో అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

దీంతో ఆయన సినిమాలో టైటిల్ ను తీసుకొని బాలయ్యను ప్రశ్నించాడు.మీతో నటించిన హీరోయిన్లలో ఊర్వశి ఎవరు.రాక్షసి ఎవరు అని ప్రశ్నించడంతో బాలయ్య.
ఊర్వశి నయనతార అంటూ.శృతిహాసన్ రాక్షసి అంటూ కామెంట్ చేశాడు.
ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్ బాగా వైరల్ అవుతుంది.
శృతిహాసన్ కూడా బాలయ్యతో నటిస్తున్న సంగతి తెలిసిందే.
మరి శృతిహాసన్ ను రాక్షసి అనటంతో.బాలయ్యను శృతిహాసన్ అంతగా పట్టి పీడించిందా అందుకే తనను రాక్షసి అని కామెంట్ చేశాడా అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
ఇక బాలయ్య మాత్రం ప్రస్తుతం తీరిక లేని లైఫ్ తో గడుపుతున్న సంగతి తెలిసిందే.







