టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే.ప్రస్తుతం ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.
ఈ సినిమా టీజర్ విడుదల కాగా నెగిటివ్ కామెంట్స్ వినిపించడంతో దాంతో సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాతో పాటు ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ లాంటి సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినా తమన్న కూడా వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఇప్పటికే టాలీవుడ్ బాలీవుడ్ లో పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది తమన్నా.
కాగా ప్రస్తుతం తమన్న చిరంజీవి నటిస్తున్న బోలా శంకర్ సినిమాలో నటిస్తోంది.అలాగే ఆమె నటించిన బాలీవుడ్ సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
ఇప్పటికే తెలుగు తమిళం కన్నడ హిందీ భాషల్లో తన సత్తాను నిరూపించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మలయాళం లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది.ఒకవైపు ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.
మరోవైపు తమన్నా భాషతో సంబంధం లేకుండా వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోంది.

సినిమా షూటింగ్లో భాగంగా బిజీ బిజీగా గడుపుతున్న తమన్నా పొటోస్ కలిసి అంత సమయం ఎక్కడ ఉంది? ఇంకా చెప్పాలి అంటే వారి బిజీ షెడ్యూల్ వల్ల సినిమా షూటింగ్లో సరిగ్గా తినడానికి సమయం ఉండదు.అలాంటిది వారిద్దరూ తీరిగ్గా కూర్చొని చెస్ ఆడడం అంటే అవి ఒట్టి మాటలే అని చెప్పవచ్చు.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో వరులు అవుతున్న ఆ వీడియో ఇప్పటిది కాదు రెబల్ సినిమా సమయంలోది.సినిమాలో ఒక షూటింగ్ గ్యాప్ లో తమన్నా ప్రభాస్ ఇద్దరు చదరంగం ఆట ఆడారు.
ఈ క్రమంలోనే తమన్నాకి ప్రభాస్ చెస్ ఎలా అని ఆడాలో నేర్పుతున్నారు.ఆ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ బిహైండ్ ద సీన్స్ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఒకరు ఆ వీడియోని అప్లోడ్ చేయడంతో అది కాస్త వరులు అవుతోంది.







