తెలుగు రాష్ట్రాల్లో కోట్ల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న స్టార్ హీరోలలో పవన్ కళ్యాణ్ ఒకరు.నిజ జీవితంలో సింపుల్ గా ఉండటానికి ఇష్టపడే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని అధికారంలోకి తెచ్చి ప్రజలకు మెరుగైన పాలన అందించాలని ఆశ పడుతున్నారు.2024లో ఏపీలో జనసేన ఆధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరుగుతోందని జనసేన నేతల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ కారును గుర్తుతెలియని వాహనాలు వెంబడిస్తున్నాయని ఆయన ఇంటి చుట్టూ అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నారని జనసేన నేతలు చెబుతున్నారు.గుర్తు తెలియని వ్యక్తులు పవన్ ఇంటి దగ్గర కారును ఆపి సెక్యూరిటీతో గొడవ పడ్డారని సమాచారం అందుతోంది.
ఈ విషయం తెలిసి జనసేన నేతలు ఆందోళనకు దిగుతున్నారు.జనసేన నేతలు ఆధారాలను సేకరించి మరీ పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఇందుకు సంబంధించిన ఫిర్యాదు నమోదైంది.పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయం దగ్గర కూడా అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నారని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరుగుతోందని జనసేన నేతలు కంగారు పడుతున్నారు.పవన్ కళ్యాణ్ అంటే గిట్టని వాళ్లు ఈ విధంగా ప్లాన్ చేశారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.

పవన్ కళ్యాణ్ ను వ్యతిరేకించే పార్టీల నేతలు ఈ ప్రచారం గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని జనసేన నేతల నుంచి సమాచారం అందుతోంది.పవన్ రాబోయే రోజుల్లో కచ్చితంగా సీఎం అవుతారని జనసైనికులు భావిస్తున్నారు.అనుమానాస్పద వ్యక్తుల గురించి పవన్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.







