ప్రముఖ టాలీవుడ్ నటి అను ఇమ్మాన్యుయేల్ తెలుగులో ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేసినా ఆ సినిమాలలో సక్సెస్ సాధించిన సినిమాల సంఖ్య తక్కువగానే ఉంది.పవన్ కళ్యాణ్ కు జోడీగా అను ఇమ్మాన్యుయేల్ నటించిన అజ్ఞాతవాసి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
అల్లు శిరీష్ కు జోడీగా అను ఇమ్మాన్యుయేల్ నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమా ఈ నెల 4వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అను ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.
గడిచిన మూడేళ్లలో సినిమా రంగంలో చాలా మార్పులు వచ్చాయని ప్రేక్షకులు హీరో కంటే కథకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె తెలిపారు.కథ బాగుంటే ఇతర విషయాలను పెద్దగా పట్టించుకోరని ఆమె కామెంట్ చేశారు.
కొన్ని సినిమాల రిజల్ట్స్ ను చూసి సినిమాల ఎంపికలో నేను మారానని అను ఇమ్మాన్యుయేల్ కామెంట్లు చేశారు.
ప్రస్తుతం మూస కథలకు దూరంగా ఉంటూ నచ్చిన పాత్రలకు ఓకే చెబుతున్నానని ఆమె చెప్పుకొచ్చారు.
ఊర్వశివో రాక్షసివో మూవీలో సింధు రోల్ లో కనిపించానని ఆ రోల్ కు నా పర్సనల్ లైఫ్ కు పోలికలు ఉంటాయని ఆమె పేర్కొన్నారు.శిరీష్ తో ప్రేమ, ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకునేలా ఉంటాయని ఆమె చెప్పుకొచ్చారు.
వేర్వేరు భావాలు ఉన్న జోడీ ఏ విధంగా ప్రయాణం చేశారనే కథతో ఈ సినిమా తెరకెక్కిందని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం.

కళ్లతోనే యాక్టింగ్ చేస్తానని పేరు సంపాదించుకున్నానని ఆమె వెల్లడించారు.సక్సెస్ లు నా చేతిలో ఉండవని నటిగా మాత్రం ఓడిపోలేదని ఆమె కామెంట్లు చేశారు.ప్రస్తుతం కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం రావణాసుర మూవీలో చేస్తున్నానని ఆమె కామెంట్లు చేశారు.







