Royal Enfield Bullet : బాబర్ బైక్‌గా మారిపోయిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్.. చూస్తే ఫిదా..!

సాధారణంగా ఆటోమొబైల్ కంపెనీలు బోరింగ్ డిజైన్‌లతో బైకులను తీసుకొస్తుంటాయి.దీనివల్ల బైకర్స్ అసంతృప్తిగా ఉంటారు.

 Royal Enfield Bullet That Has Turned Into A Babur Bike , Royal Enfield, Classic-TeluguStop.com

ఇలాంటి వారిలో కొందరు తమ బైక్స్ మాడిఫై చేసుకుంటారు.అలానే మాడిఫై చేసిన బైక్స్‌ కొనుగోలు చేసేందుకు బాగా ఇష్టపడుతుంటారు.

ఇలాంటి వారిని ఆకట్టుకునేందుకు తాజాగా నీవ్ మోటార్‌సైకిల్స్ కంపెనీ మోస్ట్ పాపులర్ బైక్ అయిన రాయల్ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్ 350ను జావా బాబర్​గా మార్చేసింది.నిజానికి కస్టమైజేషన్ స్టోర్స్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ అనేది మోస్ట్ పాపులర్ బ్రాండ్.

ఇలాంటి వాటిని మాడిఫై చేస్తే వాటిని కొనుగోలు చేసే వారు ఎక్కువ మంది ఉంటారు.

కాగా నీవ్ మోటార్‌సైకిల్స్ రాయల్ ఎన్​ఫీల్డ్​ను బాబర్​గా తీసుకొచ్చి దానికి “మైటీ” అని పేరు పెట్టారు.

విశేషమేంటంటే ఈ బుల్లెట్ బైక్ మెకానికల్ అప్‌గ్రేడ్‌లతో మరింత బ్యూటిఫుల్‌గా కనిపిస్తోంది.జావా బాబర్‌ వలె ఇందులో ఒకటే ఒకే సీటు ఉంటుంది.అలానే బ్యాక్‌రెస్ట్‌తో ప్రయాణికుల సీటును సెటప్ చేయడానికి కూడా ఒక సదుపాయం అందించారు.ఇందులో ఫెండర్లు, చట్రం కూడా పూర్తిగా మార్చేశారు.

స్వింగార్మ్ కూడా సొంతంగా తయారు చేసే అందించారు.

క్లాసిక్ 350 బైక్ కలర్ కూడా వీరు మార్చేశారు.క్లాసిక్ 350లో ఆఫ్టర్-మార్కెట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, కొత్త టర్న్ ఇండికేటర్లు, కస్టమ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, బార్-ఎండ్ మిర్రర్స్‌ అమర్చారు.అలానే కొత్త K&N ఎయిర్ ఫిల్టర్, ఎగ్జాస్ట్ ఇవ్వడం విశేషం.

ఇది చూసేందుకు చాలా బ్యూటిఫుల్‌గా ఉంది.నీవ్ మోటార్‌సైకిల్స్ సంస్థ ఇంకా మరెన్నో బైక్స్ కూడా మాడిఫై చేసింది.

వాటిపై లుక్ వేసేందుకు మీరు వారి అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీ సందర్శించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube