ప్రస్తుత కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో అయినా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల దగ్గర పెద్దవారి వరకు ఏ ఒక్కరి దగ్గరైనా స్మార్ట్ ఫోన్ ఉంది.అంతలా ఈ మొబైల్ ఫోన్ల వాడకం పెరిగిపోయింది.
టాటా గ్రూప్ భారతదేశంలో ఐఫోన్ల తయారీ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది దానికోసం తమిళనాడులోని ఒక ప్లాంట్లో వేల సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవాలని ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది.అలాంటి ప్లాంట్లలో ఐఫోన్ విడిభాగాలను తయారు చేస్తూ ఉంది.
కరోనా లాక్ డౌన్, అమెరికాలో రాజకీయ ఉత్రికతల మధ్య ఆపిల్ కంపెనీ చైనా నుంచి తన స్థావరాన్ని వేరే చోటకి మార్చాలని చూస్తోంది.ఈ సమయంలో ఆపిల్ కంపెనీ ఖచ్చితంగా భారత్ కు వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం భారతదేశంలో ఆపిల్ కంపెనీ కార్యక్రమాలను పెంచాలని చూస్తోంది.బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం తమిళనాడులో హోసూర్‌లోని ప్లాంట్‌లో పనిచేసేందుకు వచ్చే 18 నుంచి 24 నెలల్లో 45 వేల మంది ఉద్యోగులను టాటా గ్రూప్ నియమించుకోవాలని నిర్ణయం తీసుకుంది.
ఉద్యోగులందరూ మహిళలే నిర్ణయం తీసుకుంది.అయితే ఫ్యాక్టరీలలో ఇప్పటికే 10,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉండగా వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు.

ఈ ప్లాట్ ప్లాంట్ 500 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది.పోయిన సంవత్సరం సెప్టెంబర్ లో దాదాపు 5,000 మంది మహిళలను ఈ కంపెనీ నియమించుకుంది.అయితే టాటా, ఆపిల్ సంస్థలు ఈ నియామకాల గురించి పూర్తి సమాచారం తెలియజేయాల్సి ఉంది.దేశం లో ఐఫోన్ లను అసెంబుల్ చేసేందుకు ఎలక్ట్రానిక్స్ తయారీ జాయింట్ వెంచర్‌ను స్థాపించడానికి టాటా గ్రూప్ విస్ట్రాన్‌తో చర్చలు చేస్తున్నారు.
ఈ చర్చలు సఫలం అయితే త్వరలోనే ఆపిల్ కంపెనీ ఇండియా కి వచ్చే అవకాశం ఉంది.







