Indian Railway Jail :ఇండియన్ రైళ్లో ఇకనుండి అలా ఎవరైనా ప్రవర్తిస్తే డైరెక్టుగా జైలుకే!

భారతదేశంలో రైల్వే ప్రయాణం అనేది ఒకింత చవుక అని చెప్పుకోవచ్చు.అందుకే ఇందులో బీదవాళ్ళనుండి సంపన్నులవరకు ప్రతిరోజూ కొన్ని లక్షలమంది తమ గంటలకు పయనం అవుతూ వుంటారు.

 Anyone Who Behaves Like That In The Indian Train Will Go Straight To Jail , Indi-TeluguStop.com

ఈ క్రమంలో రాత్రి పూట ప్రయాణించే ప్రయాణీకులు అప్పుడప్పుడు కొన్నిరకాల ఇబ్బందులకు గురవుతూ వుంటారు.ఒక్కోసారి అవి ప్రాణాంతకంగా కూడా మారుతుంది.

దాన్ని బేస్ చేసుకొనే రైల్వేశాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.ముఖ్యంగా రాత్రి పూట ప్రయాణించేవారికి ఇవి తప్పనిసరిగా వర్తిస్తాయి అని చెప్పుకోవచ్చు.

వారు పేర్కొన్న రూల్స్ పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని రైల్వేశాఖ తాజాగా సుస్పష్టం చేసింది.ఇకపోతే ఈ నిబంధనలు ఇప్పటికే అమలులోకి వచ్చేసాయి.కాగా తాజాగా మరలా వాటిని గురించి గుర్తు చేస్తూ ప్రయాణీకులు వీటిని కచ్చితంగా పాటించాలని రైల్వేశాఖ తెలిపింది.ఇక ఎవరైనా అతిక్రమిస్తే జరిమానాతో పాటు కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరికలు జారీ చేసింది.

ఇవే ఆ నిబంధనలు:

Telugu Indian Railways, Jail, Key, Passengers, Latest-Latest News - Telugu

1.రాత్రి 10 గంటల తర్వాత రైళ్లలో ప్రయాణికులు బిగ్గరగా మాట్లాడకూడదు.అలాగే లైట్లు కూడా వెయ్యడం నిషిద్ధం.

2.సెల్‌ఫోన్లలో స్పీకర్ పెట్టి పాటలు వినకూడదు.

3.ప్రయాణీకులతోపాటు రైల్వే ఎస్కార్టు, మెయింటెనెన్స్‌ స్టాఫ్‌ కూడా ఎవ్వరూ రైళ్లల్లో గట్టిగా అరవకూడదు.

4.రాత్రి 10 గంటల తర్వాత టీటీలు టికెట్ల తనిఖీ చేయడం ఇకనుండి నిషిద్ధం.

6.బుక్ చేసుకున్న సీటుకు సంబంధించిన ప్రయాణీకులు రాకపోతే.దాన్ని వేరే ప్రయాణీకులకు(ఆర్ఏసీ) కేటాయించకూడదు.

7.అదేవిధంగా సీట్ బుక్ చేసుకున్న వ్యక్తులు రాకపోతే 2 స్టేషన్లు లేదా గంట తర్వాత వేరేవారికి టీటీఈ సీటు కేటాయించాలి.

8.ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు రైలులో ప్రయాణించేటప్పుడు.ఒకరికి సీట్ కన్ఫర్మ్ అయ్యి.మరొకరికి అవ్వకపోతే.ఒకవేళ అందులో కన్ఫర్మ్ అయిన వ్యక్తి ప్రయాణించకపొతే.దాన్ని సీట్ కన్ఫర్మ్ కాని వ్యక్తికి కేటాయించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube