మునుగోడు ఉపఎన్నికలో ఓడిపోతామనే భయంతోనే టీఆర్ఎస్ దాడులకు పాల్పడుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఎమ్మెల్యే ఈటల కాన్వాయ్ పై దాడిని ఆయన ఖండించారు.
డీసీఎం వ్యాన్లలో రాళ్లు, కర్రలు తెచ్చుకుని దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.గొడవ జరగవద్దనే ఉద్దేశంతోనే ఈటల సంయమనంగా ఉన్నారని తెలిపారు.
టీఆర్ఎస్ దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తోందని, బీజేపీ నేతల ఫోన్లను టీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేస్తోం కిషన్‌రెడ్డి ఆరోపించారు.టీఆర్ఎస్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.







