మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంలో జోరు చూపిస్తున్నాయి.నేటితో చివరి రోజు కావడంతో ఎవరికివారు ప్రచారంలో కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఈ క్రమంలో మంత్రి కేటీఆర్.బీజేపీకి ఓటేస్తే భవిష్యత్తులో గ్యాస్ సిలిండర్ ధర 3 వేలకు చేరుకుంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు ₹400 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు ₹1200 కు చేరుకుందని.విమర్శించారు.
అలాగే పెట్రోల్ ధర 70 రూపాయలు ఉంటే … నేడు 110 రూపాయలకు చేరుకుందని విమర్శించారు.ఈ రీతిగా రేట్లను పెంచిన వాళ్ళని శిక్షించాలి.లేకపోతే తప్పు చేసిన వాళ్లమవుతాం.అంటూ మున్నగోడు ఉపఎన్నిక నారాయణపురం రోడ్డు షోలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. 14 నెలలలో మునుగోడును అద్భుతంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.టిఆర్ఎస్ పేదల ప్రభుత్వం…బీజేపీ పెద్దల ప్రభుత్వం.
రైతుబంధు కావాలా? లేకపోతే రాబందు కావాలా.? నారాయణపురం ప్రజలు ఏ గట్టున ఉంటారో… తేల్చుకోవాలి అని అన్నారు. నారాయణపురం రోడ్ షోలో అభ్యర్థి శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో పాటు మంత్రులు జగదీశ్ రెడ్డి, శ్రీమతి సత్యవతి రాథోడ్ లు కూడా పాల్గొనడం జరిగింది.







