తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో ముగ్గురు నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.తమ అరెస్ట్ ను సవాల్ చేస్తూ నిందితులు నంద కుమార్, సింహయాజులు, రామచంద్ర భారతిలు సుప్రీం న్యాయస్థానానికి వెళ్లారు.
ఈ మేరకు శుక్రవారం లిస్ట్ చేయాలని సీజేఐ ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది.ఇప్పటికే నిందితులను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.