సాధారణంగా పాము కనిపిస్తే ఆమడ దూరం పరిగెడుతాం.అలాంటిది ఓ బాలుడు పామునే కొరికి చంపాడు.
ఆటాడుతుండగా ఓ పాము బాలుడిని కాటేస్తుంది.కోపోధ్రిక్తుడైన బాలుడు పాము వెంట పడ్డాడు.
దీంతో పాము పొదల్లోకి దూరిపోయింది.బాలుడు కూడా పొదలో దూరి పామును పట్టుకున్నాడు.
అయితే కోపంలో నన్నే కాటేస్తావా అంటూ ఆవేశంతో కొరికేశాడు.దీంతో పాము అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.కానీ బాలుడు మాత్రం అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లా పంద్రపుత్ గ్రామంలో చోటు చేసుకుంది.
పహాఢీ కోర్వా గిరిజన తెగకు చెందిన దీపక్ రామ్ (12 ఏళ్లు) తన సోదరితో కలిసి ఆటలు ఆడుకుంటున్నాడు.ఇంతలో వీరి దగ్గరికి ఓ పాము వచ్చింది.
దీపక్‌ను చేతిపై కాటేసింది.దీంతో ఆగ్రహానికి లోనైనా దీపక్ పారిపోయిన పామును పట్టుకుని మరీ కొరికి చంపేశాడు.
దీంతో పాము అక్కడికక్కడే చనిపోయింది.అయితే దీపక్ పామును కొరకడం తన సోదరి గుర్తించింది.
దీంతో దీపక్‌ని ఆస్పత్రికి తీసుకెళ్లింది.
ఈ మేరకు వైద్యులు దీపక్‌కు చికిత్స చేశారు.
ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.

అయితే ఇలాంటి ఓ ఘటనే టర్కీలో చోటు చేసుకుంది.ఓ బాలిక పామును కొరికేసి ఏడుస్తూ కూర్చింది.టర్కీలోని ఓ గ్రామానికి చెందిన ‘సే’ అనే బాలిక ఇంటి పెరట్లో ఆడుకుంటూ ఉంటుంది.
గట్టిగా ఏడటంతో ఇంటి సభ్యులు పరిగెత్తుకుంటూ వెళ్లారు.బాలిక పామును కొరుకుతూ కనిపించింది.
దీంతో తల్లిదండ్రులు పాప నోట్లోంచి పామును తొలగించారు.అయితే పాప పెదవులపై పాము కాటేసిన గుర్తులు ఉన్నాయి.
బాలికను వెంటనే ఆస్పత్రి తీసుకెళ్లి చికిత్స అందజేశారు.అదృష్టవశాత్తు ప్రాణాపాయ స్థితి నుంచి ‘సే’ బయటపడింది.
అయితే సే ఎంతో చురుకుగా ఉంటుందని, తనని ఎవరైనా కొట్టినా, కొట్టినా అస్సలు ఊరుకోదని ‘సే’ అమ్మ చెప్పారు.