వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికా గడ్డ మీదకు వలస వెళ్లిన భారతీయులు అక్కడ సేవా కార్యక్రమాల్లోనూ పాలు పంచుకుంటున్నారు.తమకు ఆశ్రయం ఇచ్చి ఆదుకున్న దేశానికి ఏదైనా కష్టం వస్తే ఆదుకునేందుకు ఎప్పుడూ ముందుంటున్నారు.
తాజాగా అమెరికాను ముంచెత్తిన హారికేన్ బాధితులను ఆదుకునేందుకు గాను ఫండ్ రైజింగ్ కార్యక్రమం చేపట్టారు.ఫ్లోరిడాకు చెందిన భారతీయ అమెరికన్లు, ప్రముఖ దాత డానీ గైక్వాడ్ నేతృత్వంలో హరికేన్ విపత్తు నిధి కోసం దాదాపు 1,00,000 డాలర్లు సేకరించారు.
అక్టోబర్ 26, 2022 గురువారం ఫ్లోరిడా గవర్నర్ మాన్షన్‌లో భారతీయ అమెరిక్ల కోసం గవర్నర్ రాన్ డిసాంటిస్ నిర్వహించిన దీపావళి వేడుకల సందర్భంగా ఈ సాయాన్ని ప్రకటించారు.ప్రారంభ సహకారంలో భాగంగా గవర్నర్‌కు 15,000 డాలర్ల చెక్కును అందజేసిన అనంతరం.
విపత్తు నిధికి విరాళాలు ఇవ్వాల్సిందిగా ఈ కార్యక్రమానికి హాజరైన వారికి గైక్వాడ్ పిలుపునిచ్చారు.
ఈ పిలుపుకు స్పందించిన ఓక్లాకు చెందిన వాస్కులర్ సర్జన్ డాక్టర్ రవిచంద్ర, టంపా- ఏరియా వ్యవస్థాపకుడు విజయ్ పటేల్‌లు ఒక్కొక్కరు 25,000 డాలర్లు ఇచ్చారు.
అలాగే స్థానిక బీఏపీఎస్ సంఘం సభ్యులు కూడా 25,000 డాలర్లు అందజేశారు.అక్టోబర్ 20న గైక్వాడ్ తన నివాసంలో నిర్వహించిన ఇండియన్ అమెరికన్ వర్చువల్ ఈవెంట్‌లో గవర్నర్ డిసాంటిస్ మాట్లాడుతూ.
హరికేన్ కారణంగా తమ ఇంటిని కోల్పోయిన వారికి తాత్కాలిక గృహాలను అందించే చర్యలలో కమ్యూనిటీకి చెందిన హోటల్ యజమానులు భాగం కావాలని పిలుపునిచ్చారు.దీంతో హరికేన్ బాధితులకు అండగా నిలిచేందుకు ఆసియా అమెరికన్ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ (ఏఏహెచ్‌వోఏ) , ఇండియన్ అమెరికన్ బిజినెస్ కమ్యూనిటీలు కూడా మద్ధతు పలికాయి.

ఇకపోతే.గత నెలలో హరికేన్ ఇయన్ బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే.ఇది ఫ్లోరిడా తీరాన్ని బలంగా తాకింది.
దీని కారణంగా కుండపోత వర్షాలు, దాదాపు 200 కిలోమీటర్ల వేగంతో వీచిన భీకర గాలులతో తీర ప్రాంత ప్రజలు వణికిపోయారు.గడిచిన 87 ఏళ్ల కాలంలో అమెరికాలో రికార్డైన అత్యంత శక్తివంతమైన తుపానుల్లో ఇదొకటని నిపుణులు తెలిపారు.
దీంతో పలువురు మరణించగా.భారీగా క్షతగాత్రులయ్యారు, లెక్కకు మిక్కిలిగా ప్రజలు నిరాశ్రయులయ్యారు.