తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.టాలీవుడ్ లో సిద్ధార్థ నటించినది కొన్ని సినిమాలే అయినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు.
హీరో సిద్ధార్థ్ బొమ్మరిల్లు నువ్వు వస్తానంటే నేనొద్దంటానా లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువ అయ్యాడు.ఇకపోతే హీరో సిద్ధార్థ్ గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.
కాగా గత ఏడాది హీరో శర్వానంద్, సిద్ధార్థ కలిసి నటించిన మహాసముద్రం సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు సిద్ధార్థ్.ఈ సినిమాకు ముందే ఈ సినిమాపై భారీగా అంచనాలను నెలకొన్నాయి.
కానీ ఈ సినిమా విడుదల అయ్యి ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.ఇకపోతే మహా సముద్రం సినిమాలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ లుగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే.
ఇందులో అదితి రావు, సిద్ధార్థ్ సరసన నటించింది.అయితే మహాసముద్రం సినిమా షూటింగ్ సమయంలో సిద్ధార్థ అదితి ఇద్దరు చెట్టాపట్టాలేసుకొని తిరగడంతో వారిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారు అంటూ వార్తలు జోరుగా వినిపించాయి.
కాగా ఇటీవలే అదితి రావు హైదరి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆసక్తికరమైన పోస్టును షేర్ చేశాడు సిద్ధార్థ్.ఆమెతో చనువుగా ఉన్న ఫోటోని షేర్ చేస్తూ హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ క్యాప్షన్ ను కూడా రాసుకొచ్చాడు.
దీంతో వీరిద్దరి మధ్యలో ఏదో ఉంది అన్న వార్తలు మరింత గుప్పమని వినిపించాయి.
తాజాగా ఆ వార్తలకు మరింత ఆజ్యం పోస్తూ సిద్ధార్థ్ అదితి రావు ముంబై ఎయిర్ పోర్టులో కలిసి కనిపించారు.కాగా ఆమె పుట్టిన రోజును ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవడానికి వీరిద్దరూ కలిసి వెకేషన్ కు వెల్లిన్నట్లు అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి.తాజాగా ఈ జంట ముంబై ఎయిర్ పోర్ట్ లో కలిసి కనిపించారు.
కాగా అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అందులో సిద్ధార్థ బ్లూ కలర్ షర్ట్ ముఖానికి మాస్క్ తో క్యాజువల్ లుక్ లో కనిపించగా, అదితి బ్లాక్ కోట్ బ్లూ జీన్స్ ధరించి ట్రావెల్ బ్యాగుతో కనిపించింది.
దీంతో వీరిద్దరి మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ జరుగుతుంది అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి.వీరిద్దరూ కలిసి రహస్య ట్రిప్ కు వెళ్లారా అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి.