కేరళలో మరోసారి స్వైన్ ఫ్లూ కలకలం చెలరేగింది.రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ స్వైర విహారం చేస్తోంది.
ఆళ్ళపుళలో ఫ్లూ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.దీంతో ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి.
మరోవైపు అప్రమత్తమైన అధికార యంత్రాంగం ఫ్లూ కేసులను నివారించేందుకు తగిన చర్యలు చేపడుతున్నారు.అయినా స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
అటు తమిళనాడును సైతం స్వైన్ ఫ్లూ హాడలెత్తిస్తోంది.







