కన్నడ హీరో రిషబ్ శెట్టి హీరోగా ఆయన దర్శకత్వంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కాంతార.ఈ సినిమా కన్నడ చిత్ర పరిశ్రమలో సెప్టెంబర్ 30వ తేదీ విడుదల ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇకపోతే ఈ సినిమా కన్నడ భాషలో మంచి విజయాన్ని అందుకోవడంతో తిరిగి ఈ చిత్రాన్ని అన్ని భాషలలో విడుదల చేసి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.ఇలా దేశవ్యాప్తంగా కాంతర సినిమా పేరు మార్మోగిపోతుంది.
ఇకపోతే ఈ సినిమాలో క్లైమాక్స్ లో వచ్చే వరాహ రూపం పాట తీవ్ర వివాదాలను ఎదుర్కొంటున్న విషయం మనకు తెలిసిందే.ఈ పాటను కాపీ చేశారంటూ మలయాళ సంగీత బ్యాండ్ తైక్కుడం బ్రిడ్జ్ ఆరోపణలు చేస్తూ పెద్ద ఎత్తున వివాదానికి తెర తీశారు.
ఇలా ఈ సినిమా విడుదల అయ్యి దాదాపు నెల రోజులకు కాపీ అంటూ మలయాళ సంగీత బ్యాండ్ తైక్కుడం బ్రిడ్జ్ ఆరోపణలు చేసినప్పటికీ ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదని చాలామంది భావించారు.ఇక ఈ విషయంపై చిత్ర బృందం కూడా ఏ విధంగాను స్పందించలేదు.
ఈ క్రమంలోనే మలయాళ సంగీత బ్యాండ్ తైక్కుడం బ్రిడ్జ్ తాము తెరకెక్కించిన నవరస సాంగ్ కు వరాహ రూపం పాట కాపీ ఉందంటూ

మలయాళ సంగీత బ్యాండ్ కోజికోడ్ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ క్రమంలోనే కోజికోడ్ ఈ విషయంపై విచారణ జరిపిన అనంతరం థియేటర్లలో కాంతార సినిమాలో ఉన్నటువంటి వరాహ రూపం పాటను ప్లే చేయకూడదంటూ ఆదేశాలను జారీ చేసింది.అదేవిధంగా ఈ సినిమా ప్రధాన స్ట్రీమింగ్ ప్లాట్ ఫారం నుంచి కూడా ఈ పాటను తొలగించాలని కోజికోడ్ సెషన్స్ కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తూ కాంతార చిత్ర బృందానికి షాక్ ఇచ్చారు.ఈ విషయంపై రిషబ్ శెట్టి, చిత్ర బృందం ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.







