ప్రముఖ టెక్ కంపెనీ షియోమీ భారత్‌లోని తన యూజర్లకు బ్యాడ్ న్యూస్ చెప్పింది.ఇండియాలో తన ఫైనాన్షియల్ సర్వీసులను ఆపేస్తున్నట్లు ప్రకటించింది.
ఎంఐ పే (MI Pay), ఎంఐ క్రెడిట్ (MI Credit) పేరుతో ఈ కంపెనీ కొంతకాలంగా ఫైనాన్షియల్ సర్వీసులను అందిస్తోంది.కాగా తాజాగా ఈ రెండు సర్వీసులను ఇండియాలో నిలిపేసింది.
అంతేకాదు, ఈ రెండు యాప్స్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి రిమూవ్ చేసింది.అలానే సొంత యాప్ స్టోర్‌లోనూ వీటిని తీసేసింది.
దీంతో కొత్తగా వీటిని డౌన్‌లోడ్ చేసుకోవడం కుదరడం లేదు.
ఒకవేళ ఇప్పటికే యూజర్లు తమ ఫోన్లలో ఎంఐ పే, ఎంఐ క్రెడిట్ యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకొని ఉన్నా కూడా ఇవి పనిచేయవు.
ఈ యాప్స్ ఓపెన్ చేయగానే నాట్ వర్కింగ్, నాటేబుల్ టు కనెక్ట్ అనే ఒక వార్నింగ్ మెసేజ్ కనిపిస్తోంది.మెయిన్ బిజినెస్‌పై పూర్తిస్థాయిలో ఫోకస్ చేయడం కోసమే ఈ సేవలను కంపెనీ స్టాప్ చేసింది.
కంపెనీకి చెందిన ఒక అధికారి ప్రకారం, భవిష్యత్‌లో కొత్త అప్‌డేట్స్, ప్రొడక్ట్స్‌తో షియోమీ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీ లాంచ్ చేయవచ్చు.ఎంఐ పే యాప్ దేశీయ యూపీఐ పేమెంట్స్ నెట్‌వర్క్‌లో లావాదేవీలు చేయడానికి ఉపయోగపడేది.
కాగా ఇప్పుడు అది గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ యాప్స్ జాబితాలో కనిపించడం లేదు.
షియోమీ ఎంఐ పే యాప్‌ను మూడేళ్ల క్రితం యూజర్లకు పరిచయం చేసింది.కొద్ది రోజుల తర్వాత ఎంఐ క్రెడిట్‌ను కూడా తీసుకొచ్చింది.ఎంఐ పే ద్వారా బిల్‌పేమెంట్స్, మనీ ట్రాన్స్‌ఫర్ వంటి సర్వీసులను యూజర్లు పొందారు.
ఎంఐ క్రెడిట్ యాప్ తన కస్టమర్లకు రుణ సేవలను అందించింది.