జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది.ఆగివున్న డీసీఎంను ఓ కారు ఢీకొట్టింది.
ఈ ప్రమాదం ఇటిక్యాల మండలం కోదండాపూర్ దగ్గర చోటు చేసుకుంది.ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.కాగా, రోడ్డుప్రమాదానికి అతి వేగమే కారణమని తెలుస్తోంది.