గత కొన్ని రోజులుగా ఆస్ట్రేలియాలో టి20 ప్రపంచ కప్ మ్యాచ్లు క్రికెట్ జట్ల మధ్య హోరాహోరీగా జరుగుతున్నాయి.టి20 ప్రపంచకప్ 2022లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ లో ఉన్నాడు.మన కింగ్ కోహ్లీ ముందు ఏ రికార్డ్ అయిన తలవంచాల్సిందే.అయితే టి20 వరల్డ్ కప్ 2022లో వరుస ఆఫ్ సెంచరీలతో కింగ్ కోహ్లీ పరుగుల వరద పాలిస్తున్నాడు పాకిస్తాన్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో 53 బంతుల్లో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచిన కింగ్, తాజాగా నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ ఆఫ్ సెంచరీ చేసి అజయంగా నిలిచాడు.
నెదర్లాండ్స్ తో మ్యాచ్లో విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 62 పరుగులు చేశాడు.వరుసగా రెండు అర్ధ సెంచరీలతో మంచి ఫామ్ లో ఉన్న కోహ్లీని చూసి ప్రత్యర్థి జట్లు భయపడుతున్నాయి.
ఇక టి20 ప్రపంచకప్ లలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు.ప్రపంచ కప్ మొదలవకముందు విరాట్ కోహ్లీ 845 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు.
అయితే వరుస హాఫ్ సెంచరీలు చేయడం తో మూడు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నాడు.

ప్రస్తుతం కోహ్లీ 23 మ్యాచ్ ల్లో 989 పరుగులు చేశాడు.ఇందులో 12 అర్ధ సెంచరీలు ఉన్నాయి.టీమిండియా రన్మిషన్ కోహ్లీ టి20 ప్రపంచ కప్ లో అత్యధిక పరుగుల రికార్డుకు కేవలం 28 పరుగుల దూరంలో ఉన్నాడు.టి20 ప్రపంచ కప్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు శ్రీలంక మాజీ కెప్టెన్ మహేలా జయవర్ధనే 31 మ్యాచ్లు ఆడి 1016 పరుగులు చేశాడు.మూడో స్థానంలో వెస్టిండీస్ బ్యాటర్ క్రిస్ గేల్ 33 మ్యాచ్ లు 965 పరుగులు చేశాడు.ఇందులో రెండు సెంచరీలు,7 ఆప్ సెంచరీలు ఉన్నాయి.నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో అర్ధ సెంచరీ చేసిన టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ నాలుగో స్థానంలో ఉన్నాడు.







