పశ్చిమగోదావరి జిల్లా భీమవరం బీసీ హాస్టల్లోని విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయినట్లు తెలుస్తోంది.హాస్టల్ లో ఆహారం తిన్న సుమారు 11 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
వెంటనే స్పందించిన సిబ్బంది విద్యార్థులను హుటాహుటిన భీమవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం ఆస్పత్రిలో బాధితులకు వైద్యం కొనసాగుతోంది.