తెలుగు సినీ ప్రేక్షకులకు యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నటిగా యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది అనసూయ.
మొన్నటి వరకు బుల్లితెరపై యాంకర్ గా వ్యవహరిస్తూనే మరోవైపు నటిగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోయిన అనసూయ, వెండితెరపై సినిమా అవకాశాలు ఎక్కువ అవ్వడంతో బుల్లితెరకి గుడ్ బై చెప్పేసింది.కాగా ప్రస్తుతం అనసూయ చేతినిండా బోలెడు ప్రాజెక్టులతో వరస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
అంతే కాకుండా సినిమాలలో నటనకు ఎక్కువ ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ నటి గా తన సత్తాను నిరూపించుకుంటోంది అనసూయ భరద్వాజ్.
ఇక ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు తనకు సమయం దొరికినప్పుడల్లా వెకేషన్ లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.
ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా అనసూయ అమెరికాలో విహరిస్తున్న విషయం తెలిసిందే.ఇటీవలే ఆమె తానా వేడుకల కోసం అమెరికాకు వెళ్ళినట్టు తెలిపింది.అక్కడి తెలుగు వాళ్లతో కలిసి వేడుకల్లో కూడా పాల్గొంది.ఆ తర్వాత ఆమె టెక్సాస్ కు చేరుకుంది.
ఇక అక్కడి వీధుల్లో షాపింగ్ చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది.అంతేకాకుండా పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుంటూ తన అందాలను ఆరబోస్తూ యువతకు పిచ్చెక్కిస్తోంది.
ఈ నేపథ్యంలోనే అమెరికాలోని ప్రధాన నగరాల్లో ఒకటైన టెక్సాస్ లో తిరుగుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా అనసూయ భరద్వాజ్ తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అనసూయ షేర్ చేసిన ఆ ఫోటోలో ఆమె పక్కన ఒక వ్యక్తి నిలుచొని ఉన్నాడు.అతని పేరు ఉజ్వల్ కస్టాల అని అనసూయ భరద్వాజ్ తన పోస్టులో తెలిపింది.
కాగా అమెరికాలో ఉజ్వల్ ని కలిసిన అనసూయ బర్త్డే విషెస్ తెలుపుతూ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.అనసూయ అతనికి బర్త్డే విషెస్ చెబుతూ అతని ఫోటో షేర్ చేసిన తీరు చూస్తుంటే అనసూయకు అతను చాలా క్లోజ్ అని అర్థమవుతోంది.
దీంతో నెటిజెన్స్ ఆ ఉజ్వల్ ఎవరు అని ఆరా తీయడం మొదలుపెట్టారు.కాగా అతని ప్రొఫైల్ ప్రైవేట్ కావడంతో లాక్ అయి ఉంది.దాంతో అతనికి సంబంధించిన కొన్ని వివరాలు బయటకు వచ్చాయి.అతను అడవి శేషు దర్శకత్వంలో వచ్చిన కిస్ సినిమాలో ఉజ్వల్ నటించాడు.
ఉజ్వల్ ఒక నటుడు అని తెలుస్తోంది.అనసూయకు ఫ్రెండ్ కావడంతో ఆమె ఉజ్వల్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొని ఉండవచ్చు అని నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు.







