తెలుగు సినిమా ఇండస్ట్రీకి ధర్మచక్రం ద్వారా పరిచయమయ్యారు నటి ప్రేమ.ఇలా ధర్మచక్రం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైనటువంటి రాయలసీమ రామన్న చౌదరి, దేవి,ఓంకారం వంటి ఎన్నో సినిమాలలో నటించే తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో మంచి గుర్తింపు పొందారు.
ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా కొనసాగిన ఈమె చాలా కాలం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు.ఇకపోతే తాజాగా ఈమె అనుకోని ప్రయాణం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.
ఈ సినిమా అక్టోబర్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటి ప్రేమ బుల్లితెరపై ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె ఎన్నో విషయాలను వెల్లడించారు.ఈ కార్యక్రమంలో భాగంగా అలీ ప్రశ్నిస్తూ ఎన్నో దేవత పాత్రలలో నటించారు ఇలా దేవత పాత్రలలో నటించినప్పుడు మీరు ఎలా ఫీలయ్యారు అంటూ ఈమెను ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు నటి ప్రేమ సమాధానం చెబుతూ తాను ఎక్కువగా దేవత సినిమాలలో నటించానని, అయితే థియేటర్ కి వచ్చిన జనాలు కూడా మనల్ని ఒక దేవతగా భావించి సినిమాని చూడాలి అంటూ ఈమె తెలిపారు.

ఈ విధంగా ప్రేక్షకులలో దేవత అనే ఫీలింగ్ రావాలంటే మన మొహంలో ఎప్పుడు ప్రశాంతత ఉండాలి.అందుకే తాను ఇలాంటి సినిమాలలో నటించేటప్పుడు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా ప్రశాంతంగా ఉంటానని తెలిపారు.దేవి సినిమా చేస్తున్నప్పుడు తాను నిజంగానే ఒక దేవతల ఫీల్ అయ్యి చేశానని అయితే నాగదేవత సినిమాలో మాత్రం పామును మెడలో వేసుకుని ఒక రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వమని చెప్పారు.
చాలా భయపడుతూనే ఈ సన్నివేశంలో నటించానని ఇలా తాను పాము మెడలో వేసుకొని షూటింగ్ చేస్తున్న సమయంలో సాయికుమార్ గారు అది చూసి పారిపోయారు అంటూ ఈ సందర్భంగా ప్రేమ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.







