ఏదైనా షాపులలోకి వెళ్లి ఏవైనా వస్తువులు కొనుగోలు చేస్తే ఎంఆర్‌పీపై ఎంత ధర ఉంటే అంత మొత్తం చెల్లించాలి.అదే అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ కామర్స్ వెబ్‌సైట్‌లలో చాలా వరకు ఆఫర్లు, డిస్కౌంట్లు ఉంటాయి.
ఫలితంగా తక్కువ ధరలకే వస్తువలను మనం కొనుగోలు చేయవచ్చు.అయితే అంత కంటే తక్కువ ధరకే వస్తువులు కావాలంటే మనం కొంచెం వెతుకులాట ప్రారంభించాలి.
ప్రస్తుతం ఆ శ్రమ అవసరం లేదు.భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఇ-మార్కెట్ ప్లేస్ (GeM) అందుబాటులోకి వచ్చింది.
ఇక్కడ పలు వస్తువులను మార్కెట్ రేటు కంటే, ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ల కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు.

వాణిజ్య మంత్రిత్వ శాఖ క్యాబినెట్ నోట్ ప్రభుత్వ ఇ-మార్కెట్‌ప్లేస్ (GeM), సర్కారీ ఆన్‌లైన్ ప్రొక్యూర్‌మెంట్ ప్లాట్‌ఫారమ్‌ను బిజినెస్-టు-కన్స్యూమర్ (B2C) రిటైల్ ఎంపికను అందించడానికి ఏర్పాటు చేసింది.ప్రైవేట్ ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌లలో ఉన్నట్లే ప్రైవేట్ కంపెనీల ద్వారా GeMలో జాబితా చేయబడిన ఉత్పత్తులను కొనుగోలు చేయగలుగుతారు.ప్రస్తుతం, GeM పోర్టల్ నుండి కొనుగోలు చేయడానికి ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ యూనిట్లను మాత్రమే అనుమతిస్తుంది.గణాంకాల ప్రకారం దాదాపు రూ.17,000 కోట్ల విలువైన లావాదేవీలను చూసింది.మార్కెట్ ప్లేస్ ఒక మిలియన్ కంటే ఎక్కువ ఉత్పత్తులను, దాదాపు 15,000 సేవలను అందిస్తుంది, 260,000 కంటే ఎక్కువ మంది విక్రేతలను కలిగి ఉంది.దాని క్లయింట్లు కేంద్ర మరియు రాష్ట్రాలు రెండింటిలో 37,000 ప్రభుత్వ సంస్థలు.
ప్రస్తుతం 10కి పైగా రకరకాల ఉత్పత్తులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.అవి ఇతర ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ల కంటే తక్కువ ధరకే లభిస్తాయి.
దీని పరిధి మరింత పెరిగితే దేశంలోని ప్రజలు తక్కువ ధరకే ఎన్నో వస్తువులను కొనుగోలు చేయొచ్చు.మిగిలిన ఈ-కామర్స్ సంస్థలు కూడా పోటీని తట్టుకునేందుకు ధరలు తగ్గిస్తాయి.
ఈ విధానం వల్ల వ్యాపారులకు కూడా ప్రయోజనం చేకూరుతుంది.తమ వస్తువులను దళారుల ప్రమేయం లేకుండా సరసమైన ధరలకు విక్రయించుకోగలుగుతారు.







