టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన నితిన్ సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.గత కొన్నేళ్లలో నితిన్ నటించిన సినిమాలలో అ ఆ, భీష్మ సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయనే సంగతి తెలిసిందే.
నితిన్ నటించి ఈ ఏడాది థియేటర్లలో విడుదలైన మాచర్ల నియోజకవర్గం సినిమా కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే.
అయితే నితిన్ నిజ జీవితంలో తండ్రి కాబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఒక వార్త జోరుగా ప్రచారంలోకి వచ్చింది.
దీపావళి పండుగ సమయంలో సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చిన ఈ వార్త హాట్ టాపిక్ అవుతోంది.నితిన్ తన ఫ్రెండ్ అయిన షాలినిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
పెళ్లి తర్వాత సంతోషంగా జీవనం సాగిస్తున్న సెలబ్రిటీలలో నితిన్ కూడా ఒకరు కావడం గమనార్హం.
అయితే నితిన్ తండ్రి కాబోతున్నట్టు అధికారక ప్రకటన రావాల్సి ఉంది.
వైరల్ అవుతున్న వార్త గురించి నితిన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.నితిన్ తర్వాత ప్రాజెక్ట్ లతో అయినా కెరీర్ విషయంలో మరింత ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
నితిన్ ఒక్కో ప్రాజెక్ట్ కు 5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.నితిన్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. div class=”middlecontentimg”>

వక్కంతం వంశీ డైరెక్షన్ లో నితిన్ ఒక సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో చూడాల్సి ఉంది.వక్కంతం వంశీ కెరీర్ తొలి సినిమా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.హీరో నితిన్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.








