హైదరాబాద్ లో క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి.కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.
తలాబ్ శ్మశానవాటికకు సమీపంలో పూర్తిగా కాలిపోయినస్థితిలో గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.
శ్మశానవాటిక పరిసర ప్రాంతాల్లో క్షుద్రపూజలు జరిగినట్లు ఆనవాళ్లు కనబడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని తగలబెట్టి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.