బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో సీజన్6 పై అంతోఇంతో ఆసక్తి కలగడానికి అర్జున్ కళ్యాణ్ శ్రీసత్య జోడీ ఒకటి.అర్జున్ కళ్యాణ్ ఎంతలా ట్రై చేసినా శ్రీసత్య మాత్రం అతని ప్రేమకు అంగీకరించలేదనే సంగతి తెలిసిందే.
అయితే శ్రీసత్య కోసమే అర్జున్ కళ్యాణ్ బిగ్ బాస్ షోకు వచ్చాడంటూ తాజా ఎపిసోడ్ లో షాకింగ్ విషయాలు రివీల్ అయ్యాయి.నేను బిగ్ బాస్ షోకు రావడానికి ముఖ్య కారణం శ్రీసత్య అని అర్జున్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
హోస్ట్ నాగార్జున అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించిన వెంటనే రేవంత్, శ్రీసత్య ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు.శ్రీసత్య అర్జున్ కళ్యాణ్ కోసం ఏడవటంతో అర్జున్ కళ్యాణ్ సైతం ఆశ్చర్యానికి గురయ్యారు.
నాగార్జున బిగ్ బాస్ హౌస్ లో ఆటంబాంబులు ఎవరో తుస్సుబాంబులు ఎవరో చెప్పాలని కోరగా ఫైమా, గీతూ, రేవంత్, శ్రీసత్య, శ్రీహాన్ ఆటంబాంబులు అని అర్జున్ కళ్యాణ్ వెల్లడించారు.
బాలాదిత్య, ఇనయా సుల్తానా, కీర్తి, మెరీనా, రోహిత్ తుస్సు బాంబులు అని అర్జున్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఆ తర్వాత శ్రీసత్య వల్లే నేను బిగ్ బాస్ హౌస్ కు వచ్చానని అర్జున్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.నేను శ్రీసత్యను ఒక సినిమాకు రిఫర్ చేయడం జరిగిందని అయితే ఆ సినిమాకు డేట్లు కేటాయించలేనని శ్రీసత్య చెప్పిందని అర్జున్ కళ్యాణ్ పేర్కొన్నారు.
బిగ్ బాస్ షోకు వెళుతున్నానని అందుకే డేట్లు కేటాయించడం లేదని చెప్పిందని అర్జున్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత నేను బిగ్ బాస్ షో కోసం అప్లై చేయగా ఆ షోలో ఛాన్స్ దక్కిందని అర్జున్ కళ్యాణ్ కామెంట్లు చేశారు.బిగ్ బాస్ షో ఆఫర్ వచ్చిన తర్వాత మొదట శ్రీసత్యకు వెల్లడించానని అర్జున్ కళ్యాణ్ వెల్లడించారు.ఈ విషయం ఇప్పటివరకు తనకు కూడా తెలియదని అర్జున్ కళ్యాణ్ పేర్కొన్నారు.