తాజాగా అనగా అక్టోబర్ 23న టాలీవుడ్ హీరో పాన్ ఇండియా ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో ప్రభాస్ పేరు మారుమోగిపోయింది.అంతేకాకుండా ప్రభాస్ కి అభిమానులు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా బర్తడే విషెస్ తెలిపారు.
ప్రభాస్ బర్త్ డే సందర్భంగా డార్లింగ్ అభిమానులు సంతోషంగా పండగ చేసుకుంటుండగా ఆ అభిమానుల ఆనందాన్ని మరింత రెట్టింపు చేయడం కోసం ప్రభాస్ నటిస్తున్న సినిమాల నుంచి స్పెషల్ పోస్టర్స్ ను రిలీజ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.కాగా ఇప్పటికే ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె, సలార్ చిత్రాల నుంచి అప్డేట్స్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
అయితే ప్రభాస్ కు కేవలం అభిమానులు మాత్రమే కాకుండా స్టార్ సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదిక శుభాకాంక్షలు తెలిపారు.కాగా ఇప్పటికే దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ నీల్, జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి స్టార్ సెలబ్రిటీలు ప్రభాస్ కు బర్త్ డే విషెస్ ను తెలిపారు.
ఈ నేపథ్యంలోనే హీరోయిన్ మాళవిక మోహనన్ ప్రభాస్ కు బర్త్ డే విషెస్ తెలిపింది.ఈ క్రమంలోనే అయితే ఆమె చేసిన ట్వీట్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
హ్యాపీ బర్త్ డే టూ వన్ ఆఫ్ మై ఫేవరేట్.మీరు మరింత ఎత్తుకు ఎదగాలి అని రాసుకొచ్చింది మాళవిక మోహన్.
మాళవిక చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవడంతో ఆ ట్వీట్ పై స్పందించిన పలువురు నెటిజన్స్.ఈ ఇద్దరి మీ కాంబినేషన్ లో సినిమా చూసేందుకు మేము వెయిటింగ్, ప్రభాస్ మారుతి హీరోయిన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.ఇకపోతే డార్లింగ్ ప్రభాస్ విషయానికొస్తే.ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్ కె,స్పిరిట్, సలార్ లాంటి సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.అలాగే ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని త్వరలోనే విడుదల కానుంది.