ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఆచార్య తర్వాత మెగా ఫ్యాన్స్ పూర్తి నిరాశలోకి వెళ్లి పోయారు.
దీంతో ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకుని గాడ్ ఫాదర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మెగాస్టార్.ఇక ఈ సినిమా సక్సెస్ తర్వాత ఇప్పుడు మరో సినిమాను రెడీ చేస్తున్నాడు.
ప్రెసెంట్ చిరు చేస్తున్న సినిమాల్లో వాల్తేరు వీరయ్య (వర్కింగ్ టైటిల్) ఒకటి.మెగాస్టార్ 154వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.ఇటీవలే కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసారు.
రాజమండ్రి లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసి మెగాస్టార్, రవితేజ మధ్య కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించ నున్నారట.
ఇక తాజాగా ఈ సినిమా నుండి మరొక ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది.
ఈ సినిమాలో చిరు, రవితేజ కాంబో లో ఒక ఫన్ సాంగ్ ను షూట్ చేస్తున్నట్టు సమాచారం.ఈ శనివారం నుండి అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ స్పెషల్ సాంగ్ షూట్ స్టార్ట్ చేసారని.
ఈ పాట సరదాగా సాగిపోతుంది అని తెలుస్తుంది.

ఇక ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారట.మరి శేఖర్ మాస్టర్ అంటే స్టెప్పులు అదిరిపోతాయని ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు.
ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మాస్ రాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
అలాగే 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించారు.








