దివాళి పుణ్యమాని ఆన్‌లైన్ మార్కెట్లో అదిరిపోయే ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి పండగనే చెప్పుకోవాలి.
ఈకామర్స్ దిగ్గజాలు అయినటువంటి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పోటాపోటీ ఆఫర్లు పెడుతున్నాయి.ఇకపోతే ఈ ఆఫర్లు అక్టోబర్ 23 వరకే అందుబాటులో వుంటాయని అందరూ గ్రహించి అప్రమత్తం అయితే బావుంటుంది.
ఇక అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్ సేల్ కూడా రేపటితో ముగియనుంది.అలాగే ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ కూడా రేపు క్లోజ్ అవుతుంది.
అందువల్ల మీరు కొత్తగా ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తే.ఇప్పుడే సిద్ధపడటం ఉత్తమం.
ప్రస్తుతం అయితే అమెజాన్‌లో ఒక ఫోన్‌పై సూపర్ ఆఫర్ అందుబాటులో ఉంది.పైగా వన్‌ప్లస్ కంపెనీకి చెందినది అది.స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 10ఆర్5జీ పరైమ్ ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది.దీనిపైన పలు రకాల ఆఫర్లను మనం చూడవచ్చును.ఈ ఫోన్ అసలు మాటికెట్లో ధర రూ.38,999 వుంది.8 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ వేరియంట్‌కు ఇది వర్తిస్తుంది.అయితే ఈ ఫోన్‌ను గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా రూ.32,999కు కొనొచ్చు.అంటే ఈ ఫోన్‌పై సుమారు 15% తగ్గింపు ఉంది.అలాగే బ్యాంక్ ఆఫర్ ఎంపిక చేసుకుంటే, క్రెడిట్ కార్డులపై రూ.1750 వరకు, ఇంకా ఎక్స్చేంజ్ ఆఫర్ కుండా రూ.28 వేల వరకు తగ్గింపు పొందొచ్చు.

ఇక ఇపుడు ఈ ఆఫర్లు అన్నింటినీ కలుపుకుంటే.రూ.3249కే దీన్ని దక్కించుకోవచ్చు.అయితే ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది మీ ఫోన్ వేరియంట్ మీద ఆధారపడి ఉంటుంది.అంటే కొన్ని ఫోన్లకు ఎక్కువ విలువ రావొచ్చు.
కొన్నింటికి తక్కువ విలువ రావొచ్చు.అందువల్ల మీరు మీ ఫోన్‌కు ఎంత ఎక్స్చేంజ్ విలువ ఉందో చెక్ చేసుకొని కాలిక్యులేట్ చేసుకుంటే ఉత్తమం.
అంతేకాకుండా మీ వద్ద క్రెడిట్ కార్డు ఉంటే.మీరు ఈఎంఐలో ఈ ఫోన్‌ను కొనుగోలు చేసుకొనే వీలుంది.







