యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు నేడు.ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు సందడి చేస్తున్నారు.
నేడు ఉదయమే ప్రభాస్ నటించిన బిల్లా సినిమా ను ప్రదర్శించిన విషయం తెలిసిందే.అభిమానులు పెద్ద ఎత్తున సినిమా కోసం థియేటర్ల వద్ద క్యూ కట్టారు.
ఇక ఆదిపురుష్ నుండి కొత్త పోస్టర్స్ ని విడుదల చేయడం జరిగింది.ప్రభాస్ ఆ ఒక్క సినిమాలో మాత్రమే కాకుండా పలు సినిమాల్లో నటిస్తున్నాడు.
కానీ అవేవీ అప్డేట్ రాక పోవడం తో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఒక వైపు దీపావళి ఉంది మరో వైపు ప్రభాస్ పుట్టిన రోజు.
అయినా కూడా ఎందుకు ఆ సినిమా దర్శకులు అప్డేట్ ఇవ్వడం లేదు అంటూ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ పుట్టిన రోజు కు ప్రభాస్ అభిమానులు చాలా ఎక్కువగా ఆశించారట.కానీ అవేవీ దక్కడం లేదని వారు ఆగ్రహంతో ఉన్నారు.ప్రభాస్ తో సినిమాలు చేస్తున్న దర్శకులు నిద్రపోతున్నారా అంటూ చాలా మంది సోషల్ మీడియా ద్వారా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి ప్రభాస్ అభిమానులు సంతోషంగా లేరని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.ఇటీవల ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు మృతి చెందిన విషయం తెలిసిందే.ఆ కారణంగా చిత్ర యూనిట్ సభ్యులు హంగామా వద్దు అనే ఉద్దేశం తో ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదా అంటూ కొందరు చర్చించుకుంటున్నారు.ఏది ఏమైనా ఆయన నేడు ప్రభాస్ పుట్టిన రోజు కి ఎలాంటి సినిమా అప్ డేట్స్ లేక పోవడం తో వారి వారి అభిమానులు అసంతృప్తి తో ఉన్నారు.
సాయంత్రం వరకైనా ప్రభాస్ ఫ్యాన్స్ లో కొంత మేరకు సంతోషం చూస్తామేమో చూడాలి.







