టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2. ఈ సినిమా ఆగస్టు 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ సినిమా కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకొని 100 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న ఈ సినిమాపై తాజాగా పరుచూరి గోపాలకృష్ణ అభిప్రాయాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా పరుచూరి ఈ సినిమా గురించి మాట్లాడుతూ కష్టేఫలి అనే సూత్రం నిఖిల్ విషయంలో ఎంతో అద్భుతంగా కనిపిస్తోంది.ఈ సినిమా కోసం ఖర్చు చేసిన బడ్జెట్ కన్నా నాలుగు రెట్లు అధికంగా లాభాలను తెచ్చిపెట్టింది.
ఈ సినిమా డైరెక్టర్ చందు మొండేటి జానపద కథను సాంఘిక కథగా మలిచి రాసినట్లు అనిపించింది.కథను నమ్మితే ఆ కథ ఎప్పుడూ మనల్ని మోసం చేయదు.
డైరెక్టర్ ఈ సినిమాలో తల్లి సెంటిమెంట్ మాత్రమే కాకుండా ఒకవైపు కమెడియన్ మరోవైపు హీరోయిన్ కూడా చూపించారు.
మామూలుగా ఇలాంటి సినిమాలు కనుక చేస్తే సినిమాలలో కాస్త లవ్ సన్నివేశాలు మిస్ అవుతూ ఉంటాయి.
కానీ డైరెక్టర్ మాత్రం ప్రతి ఒక్క ఫ్రేమ్ లోను హీరో హీరోయిన్ కనిపించే విధంగా సినిమాని తీశారు.ఇక ఈ సినిమాలో అనవసరమైన కామెడీ ఎక్కడా పెట్టకుండా ప్రతి సన్నివేశం కూడా ఎంతో అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.ఇక ఈ సినిమా చివరిలో కార్తికేయ 2కి కూడా సీక్వెల్ ఉంటుందని ఎంతో అద్భుతంగా హింట్ ఇచ్చారని నిజంగా ఈ సినిమా కోసం డైరెక్టర్ చందు మొండేటి పెద్ద సాహసమే చేశారంటూ పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు.