బిజెపి జనసేన పార్టీల మధ్య ఏపీలో పొత్తు పెటాకులు అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.అయినా 2024 ఎన్నికల్లో బిజెపి జనసేన కలిసి ఉమ్మడిగానే పోటీ చేస్తాయంటూ బిజెపి నాయకులు ప్రకటిస్తున్నారు.
అయితే పవన్ నుంచి ఆ స్థాయిలో స్పందనైతే కనిపించడం లేదు.బిజెపితో వెళ్లడం కంటే, టిడిపి తో వెళ్లడమే మేలు అన్నట్లుగా ఆయన వ్యవహారం ఉంది.
ఇక తెలంగాణలోనూ జనసేన పోటీ చేస్తుందని పవన్ ఇటీవలే ప్రకటించారు.దీంతో బీజేపీతో కలిసి తెలంగాణలో పోటీ చేస్తారా ? విడిగానే పోటీ చేస్తారా అనే విషయంలో అందరికీ అనేక అనుమానాలు ఉంటూ వస్తున్నాయి.ఇదిలా ఉంటే తెలంగాణ బిజెపి లో కీలక నాయకుడిగా ఉన్న దాసోజు శ్రావణ్ బిజెపికి రాజీనామా చేసి టిఆర్ఎస్ లో చేరారు. దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాసోజు శ్రావణ్ ను అభినందిస్తూ ట్వీట్ చేశారు.
అయితే ఈ ట్వీట్ తెలంగాణ బిజెపి నాయకులకు ఆగ్రహం కలిగించింది.దాసోజు శ్రవణ్ బిజెపికి రాజీనామా చేసి టిఆర్ఎస్ లోకి వెళ్లారనే విషయం కంటే, పవన్ ఆయన బిజెపి నుంచి టిఆర్ఎస్ లో చేరడంపై అభినందించడం తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది.
వాస్తవంగా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి మద్దతుగా తెలంగాణలో పవన్ ప్రచారం చేస్తారని అంత భావిస్తుండగా , పవన్ మాత్రం బిజెపి విషయంలో ఏపీ తెలంగాణలోనూ అసంతృప్తితోనే ఉన్నారు.గతంలో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో జనసేన కార్పొరేటర్ అభ్యర్థులను ప్రకటించింది.
ఆ తర్వాత బీజేపీ కోసం త్యాగం చేసింది.అయితే ఆ సమయంలో బిజెపి లోని కొంతమంది నాయకులు పవన్, జనసేన మద్దతు తమకు అవసరం లేదని అవమానకరంగా మాట్లాడడంపై పవన్ కు అప్పటి నుంచి తెలంగాణ బిజెపిపై అసంతృప్తి ఉంది.

ఈ క్రమంలోనే ఇప్పుడు దాసోజు శ్రవణ్ ను అభినందించి తెలంగాణ బిజెపి నాయకులకు మంట పుట్టించారు.అయితే ఇందులో బీజేపీపై కోపం ఏమీ లేదని, గతంలో దాసోజు శ్రావణ్ ప్రజారాజ్యంలో పనిచేశారని, ఆయనతో సాన్నిహిత్యం ఉండడం వల్లే పవన్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ వెయిట్ చేశారని ఇందులో అంత రాజకీయం ఏమీ లేదంటూ జనసేన వర్గాలు ప్రకటిస్తున్నాయి.అయినా తెలంగాణ బిజెపి నాయకులకు మాత్రం ఈ వ్యవహారం తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది.








