దీపావళి పండుగ సందర్భంగా హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా యాక్టివా స్కూటర్‌పై అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది.ఇప్పుడు కొనుగోలుదారులు ఈ యాక్టివా స్కూటర్‌ను 5% క్యాష్‌బ్యాక్‌తో రూ.5,000 వరకు తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు.అయితే, ఈ ఆఫర్ అక్టోబర్ 31 మాత్రమే అందుబాటులో ఉంటుంది.
సెలెక్టెడ్ డెబిట్/క్రెడిట్ కార్డ్‌లపై ఈఎంఐ లావాదేవీలపై మాత్రమే క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.ఈ స్కూటర్‌పై జీరో డౌన్ పేమెంట్, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా కొనుగోలు దారులు ఎంచుకోవచ్చు.
కూడా ప్రకటించింది.
కంపెనీ 110సీసీ యాక్టివా 6జీ, 125సీసీ యాక్టివా 125 మోడళ్లను విక్రయిస్తోంది.యాక్టివా 6జీ రూ.73,086 ప్రారంభ ధర లభిస్తుంది.యాక్టివా 125 రూ.77,062 స్టార్టింగ్ ప్రైస్‌తో దొరుకుతుంది.యాక్టివా 6G STD రూ.73,086, యాక్టివా 6జీ DLX: రూ.75,586, యాక్టివా ప్రీమియం ఎడిషన్ డీలక్స్ రూ.76,587, యాక్టివా 125 డ్రమ్ రూ.77,062, యాక్టివా 125 డ్రమ్ అల్లాయ్ రూ.80,730, యాక్టివా 125 డిస్క్ రూ.84,235 ధరలకు లభిస్తున్నాయి.

టీవీఎస్ జుపిటర్ 110 స్కూటర్ ప్రస్తుతం 5% లేదా రూ.5,000 వరకు క్యాష్‌బ్యాక్‌తో అందుబాటులో ఉందని డీలర్ వర్గాలు పేర్కొన్నాయి.ఇది కూడా పరిమిత-కాల ఆఫర్ మాత్రమే.
ఈ ఆఫర్ జుపిటర్ 110లో మాత్రమే అందుబాటులో ఉందని, పెద్ద జుపిటర్ 125 స్కూటర్‌పై కాదని గమనించాలి.జుపిటర్ షీట్ మెటల్ వీల్ రూ.71,781.జుపిటర్ STD రూ.74,806.జుపిటర్ ZX రూ.79,281.IntelliGoతో జుపిటర్ ZX డిస్క్ రూ.83,081.జుపిటర్ ZX SmartXonnect రూ.86,081, జుపిటర్ క్లాసిక్ రూ.86,701 ధరలకు లభిస్తున్నాయి.మరిన్ని వివరాలకు కొనుగోలుదారులు తమ సమీపంలో ఉన్న డీలర్‌షిప్ పాయింట్స్ విజిట్ చేయవచ్చు.







