టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగు సినీ ఇండస్ట్రీలో సమంత ఒక సంచలనం అని చెప్పవచ్చు.
తరచూ ఏదో ఒక విషయంపై సమంత పేరు సోషల్ మీడియాలో మారుమోగుతూనే ఉంటుంది.విడాకుల తర్వాత అయితే సమంత మరింత యాక్టివ్ గా ఉంటూ సోషల్ మీడియాలో సందడి సందడి చేస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంది.
ఇకపోతే ప్రస్తుతం సమంత వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.సినిమాలలో పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఉన్న కథలను ఎంచుకుంటూ దూసుకుపోతోంది.
ఈ నేపథ్యంలోని సమంత యశోద, శాకుంతలం లాంటి ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలలో నటించింది.ఇది ఇలా ఉంటే తాజాగా సమంత నటించిన యశోద సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
అదేమిటంటే ఈ సినిమాలో సమంత రిస్కీ ఫైట్స్ చేసిందట.సమంత నటించిన ఈ యశోద సినిమా యాక్షన్ త్రిల్లర్ గా రూపొందుతున్న విషయం తెలిసిందే.ఇందులో చాలా యాక్షన్స్ సన్నీవేశాలు ఉన్నాయి అని సమాచారం.అయితే ఈ సినిమాలో ఉన్న అన్ని సన్నివేశాలకు న్యాయం చేకూర్చాలని భావించిన సమంత ఇంటర్నేషనల్ స్టంట్ మ్యాన్ యానిక్ బెన్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుందట.

యశోద సినిమాలో ఫైట్స్ సీన్స్ చాలా కొత్తగా ఉంటాయి అని తెలుస్తోంది.ఇంతకుముందు ఏ సినిమాలో కూడా ఇటువంటి ఫైట్స్ డిజైన్ చేయలేదని సమాచారం.ఇకపోతే సమంత నటించిన యశోద సినిమాకు హరీష్ వహించిన విషయం తెలిసిందే.ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 11న విడుదల కానుంది.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఆమె అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఇకపోతే గత కొంతకాలంగా సమంత సోషల్ మీడియాలో కానీ సినిమాల ప్రమోషన్స్ లో షూటింగ్లో కానీ ఎక్కడ కనిపించడం లేదు.
అంతేకాకుండా ప్రస్తుతం ఆమె మన ఇండియాలోనే లేదు అని వార్తలు వినిపిస్తున్నాయి.కొన్ని అనారోగ్యాల కారణంగా ప్రస్తుతం సమంత విదేశాలలో ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.







