అఖండ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలకృష్ణ తన నెక్స్ట్ సినిమా గోపీచంద్ మలినేని డైరక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా కోసం 18 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్న బాలయ్య బాబు తర్వాత చేయబోయే అనీల్ రావిపుడి సినిమాకు మరో ఏడు కోట్లు రెమ్యునరేషన్ పెంచేశారట.
ఎన్.బి.కె 108వ సినిమా అనీల్ రావిపుడి డైరక్షన్ లో షైన్ స్క్రీన్ బ్యానర్ లో ఈ మూవీ తెరకెక్కుతుంది.నవంబర్ లో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఈ సినిమా కోసం బాలకృష్ణ 25 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.బాలయ్య బాబు సినిమా హిట్టు పడితే కలక్షన్స్ మోత మోగాల్సిందే.అదికూడా సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనీల్ రావిపుడి కాంబో సినిమా కాబట్టి ఆ మాత్రం డిమాండ్ చేయాల్సిందే.సినిమా బడ్జెట్ కూడా భారీగానే ఉండబోతుందని తెలుస్తుంది.
అఖండతో వసూళ్ల సునామి సృష్టించిన బాలకృష్ణ రాబోతున్న రెండు సినిమాలతో దుమ్ముదులిపేస్తాడని చెప్పడం లో సందేహం లేదు.బాలయ్య బాబు చేస్తున్న ఈ వరుస సినిమాలు తోటి స్టార్ హీరోలకు చెమటలు పట్టించేస్తున్నాయి.
అంతేకాదు ఈమధ్య ఆయన ఓటీటీ షో అన్ స్టాపబుల్ హోస్ట్ గా కూడా అదరగొట్టేస్తున్నారు.