చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌పై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.మూడోసారి అధ్యక్ష పదవి చేపట్టబోతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రజల్లో ఆయనపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది.
చైనాకు జిన్‌పింగ్ మరోసారి అధ్యక్ష పదవి చేపట్టోద్దని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇటీవల బీజింగ్ నగరంలోని ఓ ఫ్లైఓవర్‌పై భారీ ఎత్తున రెండు బ్యానర్లు వెలిశాయి.
వాటిని వెంటనే తొలగించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.అలాగే జిన్ పింగ్ అమలు చేస్తున్న జీరో కోవిడ్ పాలసీని కూడా వ్యతిరేకించారు.
అయితే ఆందోళనలు పెరగడంతో.అక్కడి ప్రభుత్వం నిరసనకారులను అక్కడికక్కడే కట్టడి చేస్తున్నారు.
దీంతో నిరసనకారులు మరుగుదొడ్లను ఎంచుకుంటున్నారు.
తమ నినాదాలను మరుగుదొడ్లపై, పాఠశాలల గోడలపై, నోటీసు బోర్డులపై రాస్తున్నారు.
అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో ‘వాయిస్ ఆఫ్ సీఎన్’ అనే అకౌంట్‌ను క్రియేట్ చేసి చైనాలో ప్రజాస్వామ్యం కావాలని పోరాటం చేస్తున్నారు.జిన్‌పింగ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని ఇప్పటికే చైనాలోని 8 ప్రధాన నగరాల్లో వ్యతిరేకత మొదలైంది.
షాంఘై, షెంజెన్, హాంగ్‌కాంగ్, గ్వాంగ్ఘౌ, బీజింగ్ వంటి ప్రముఖ నగరాలు ఉన్నాయి.అమెరికా, చైనా, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ తదితర దేశాల్లోని సుమారు 200 విశ్వవిద్యాలయాల్లో జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు వస్తున్నాయి.
‘నియంతృత్వాలను తిరస్కరించండి’ అనే నినాదాన్ని రాస్తూ నిరసనకారులు వ్యతిరేకిస్తున్నారు.
అలాగే ఈ సందేశాన్ని వ్యాపింపజేయాలని ప్రచారం చేస్తున్నారు.బీజింగ్‌లోని సైటోంగ్ బ్రిడ్జి వద్ద ఓ యువకుడు ఓ టైరును కాల్చి రెండు బ్యానర్లను బ్రిడ్జికి కట్టాడు.ఈ బ్యానర్‌లో ‘దేశ ద్రోహి, నియంత జిన్‌పింగ్‌ను వెంటనే అధ్యక్ష పదవి నుంచి తొలగించాలి.
’ అని ఉంది.అలాగే మరో బ్యానర్‌లో కోవిడ్ కఠిన నిబంధనలు అమలు చేయడంపై వ్యతిరేకించాడు.
ఈ ఘటన ఈ నెల 13వ తేదీన జరగింది.దీని తర్వాతనే దేశంలోని నిరసనకారులు ఆందోళనలు చేపట్టడం మొదలుపెట్టారు.
దేశంలో బానిసలుగా బతకాలని మేం కోరుకోవడం లేదని, ఓటు వేసి తమ ప్రతినిధులను ఎన్నుకుంటామని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.