ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటించిన ఆర్.ఆర్.ఆర్ సినిమా ఈ ఏడాది మార్చి 24న రిలీజై సూపర్ సక్సెస్ అందుకుంది.ఆ బాహుబలి తర్వాత చిన్న సినిమా చేస్తానని చెప్పిన రాజమౌళి అలా తీస్తే ఎలా అనుకున్నాడో ఏమో బాహుబలికి మించిన సినిమా చేశాడు.
అసలు మెగా నందమూరి కాంబో సినిమా అనగానే ప్రేక్షకుల్లో ఎక్కడ లేని అంచనాలు ఏర్పడ్డాయి.అయితే అంచనాలకు తగినట్టుగానే సినిమా దుమ్ముదులిపేసింది.1100 కోట్ల వసూళ్లతో మరోసారి జక్కన్న స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది.ఇక ఇప్పుడు ఈ సినిమా జపాన్ లో రిలీజ్ చేస్తున్నారు.
శుక్రవారం జపాన్ లో రిలీజ్ అవుతున్న సందర్భంగా ఎన్.టి.ఆర్, రాం చరణ్, రాజమౌళి అక్కడ ప్రమోషన్స్ చేసేందుకు జపాన్ వెళ్లారు.జపాన్ సినీ ప్రేక్షకులు ఆర్.ఆర్.ఆర్ హీరోల మీద తమ అభిమానాన్ని చూపించారు ఇక అక్కడ మీడియా హౌస్ లో ఆర్.ఆర్.ఆర్ టీం హడావిడి చేస్తుంది.ఎన్.టి.ఆర్, రాం చరణ్, రాజమౌళి ముగ్గురు జపాన్ మీడియాలో హంగామా సృష్టిస్తున్నారు.వాటికి సంబందించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
బాహుబలి జపాన్ లో బ్లాస్టింగ్ హిట్ కాగా అదే రేంజ్ లో ఆర్.ఆర్.ఆర్ కూడా సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నారు.







