ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన మంచు విష్ణు నటించిన జిన్నా మూవీ మరికొన్ని గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వేర్వేరు విషయాల గురించి స్పందిస్తున్న విష్ణు తన పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా స్పందించి క్లారిటీ ఇచ్చారు.
నేను ఇతర పార్టీ నేతలను కలిసినంత మాత్రాన ఆ పార్టీలో చేరుతున్నట్లు కాదని మంచు విష్ణు వెల్లడించారు.
తాను నటుడిగా కెరీర్ ను కొనసాగించడానికే ఈ జన్మ ఎత్తానని నటుడిగానే కెరీర్ ను కొనసాగిస్తానని విష్ణు చెప్పుకొచ్చారు.
విష్ణు వెల్లడించిన విషయాలు వైరల్ అవుతున్నాయి.మరోవైపు విష్ణు నటించిన జిన్నా మూవీకి ఇతర సినిమాల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.
ఇతర సినిమాలతో పోల్చి చూస్తే జిన్నా మూవీకి బెటర్ టాక్ వస్తే మాత్రమే ఈ సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.
విష్ణు తర్వాత ప్రాజెక్ట్ లలో ఢీ సీక్వెల్ ఒకటి కాగా ఢీ సీక్వెల్ సినిమాకు శ్రీనువైట్ల డైరెక్టర్ గా ఉన్నారు.

శ్రీనువైట్లకు ఈ మధ్య కాలంలో వరుస షాకులు తగులుతుండగా ఢీ సీక్వెల్ తో పాటు గోపీచంద్ హీరోగా ఒక సినిమాను తెరకెక్కించడానికి ఆయన సిద్ధమవుతున్నారు.ఈ రెండు సినిమాలలో ఏ సినిమా మొదట తెరకెక్కుతుందో చూడాలి.శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో వరుసగా 4 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

శ్రీనువైట్ల ఒకప్పుడు తెరకెక్కించిన సినిమాల విజయంలో గోపీమోహన్, కోన వెంకట్ పాత్ర ఎంతో ఉంది.అయితే వాళ్లిద్దరినీ దూరం చేసుకోవడం వల్లే ఇప్పుడు శ్రీనువైట్లకు వరుస ఫ్లాపులు తగులుతున్నాయి.శ్రీనువైట్ల పారితోషికం సైతం గతంతో పోల్చి చూస్తే భారీగా తగ్గిందని బోగట్టా.
విష్ణు, శ్రీనువైట్ల తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.







